అమెరికా: సైన్స్ పోటీలలో భారత సంతతి చిన్నారుల ప్రతిభ.. ప్రథమ బహుమతి సహా మూడు మనవే

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వలసవెళ్లి అమెరికాలో స్థిరపడిన భారత సంతతి వ్యక్తులు అక్కడ అన్ని రంగాల్లో రాణిస్తున్నారు.అయితే పెద్దలే కాదు చిన్నారులు సైతం తమ మేధాశక్తితో అమెరికాతో పాటు భారత్‌కు గర్వకారణంగా నిలుస్తున్నారు.

 Indian-origin Kid Wins Top Prize In Us Science Contest For Middle Schoolers , Ak-TeluguStop.com

తాజాగా భారత సంతతికి చెందిన అఖిలన్ శంకరన్ రూపొందించిన కంప్యూటర్ ప్రోగ్రామ్‌కు సైన్స్ పోటీలో ప్రథమ బహుమతి దక్కింది.

గురువారం జరిగిన ప్రతిష్టాత్మక బ్రాడ్‌కామ్ మాస్టర్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పోటీలో 14 ఏళ్ల అఖిలన్ 25,000 డాలర్ల బహుమతిని గెలచుకున్నాడు.10,000 డాలర్ల విలువచేసే తదుపరి బహుమతులను గెలుచుకున్న నలుగురు చిన్నారులలో ముగ్గురు భారత సంతతికి చెందినవారు వున్నారు.అలాగే 30 మంది ఫైనలిస్టులలో 15 మంది ఇండో అమెరికన్ చిన్నారులు వుండటం విశేషం.

బ్రాడ్‌కామ్ ఫౌండేషన్‌తో పోటీని నిర్వహిస్తున్న సొసైటీ ఫర్ సైన్స్ (ఎస్ఎఫ్ఎస్) ప్రెసిడెంట్ మాయా అజ్మీరా మాట్లాడుతూ.ఈ రోజు విజయం సాధించిన పిల్లలు ప్రపంచంలోని అత్యంత కఠినమైన సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నారని ఆమె ప్రశంసించారు.

బ్రాడ్‌కామ్ మాస్టర్స్ ఫైనలిస్టులు మనందరికీ స్పూర్తిదాయకంగా నిలుస్తారని వారు STEM ( సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ మరియు మ్యాథమేటిక్స్) ప్రయాణంలో అద్భుత విజయాన్ని సాధిస్తారని మాయా ఆకాంక్షించారు.

Telugu Broadcom, Broadcommasters, Camellia Sharma, India, Indianorigin, Maya Ajm

యాంటిప్రైమ్ నంబర్‌లుగా పిలిచే 1,000 అంకెల కంటే ఎక్కువ పొడవు వున్న “highly divisible numbers” ను లెక్కించగల కంప్యూటర్ ప్రోగ్రామ్‌‌ను అఖిలన్ రూపొందించినట్లు మాయా అజ్మీర్ తెలిపారు.‘ఖగోళ భౌతిక శాస్త్రవేత్త కావాలన్నది అఖిలన్ శంకరన్‌ లక్ష్యమని చెప్పాడు.ఇక ఇదే పోటీలో 10,000 డాలర్ల బహుమతిని గెలిచింది కామెల్లియా శర్మ (14).

ఆమె ఒక త్రీడి ప్రింటెడ్ ఏరియల్ డ్రోన్/ బోట్‌ను నిర్మించింది.అది నీటి అడుగున ఫోటోలు తీయడంతో పాటు.

అందులో అమర్చిన సాఫ్ట్‌వేర్ అక్కడ సంచరిస్తున్న చేపలను లెక్కించగలదు.ఇదే విధమైన అవార్డు పొందిన ప్రిషా ష్రాఫ్ కృత్రిమ మేధస్సు ఆధారంగా కార్చిచ్చులను నివారించే వ్యవస్థను రూపొందించింది.

మరో విద్యార్ధిని రైఖా సీ చోప్రా కూడా 10,000 డాలర్ల బహుమతిని పొందారు.కమ్యూనిటీల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే సామాజిక కారకాలపై అధ్యయనం చేసే జియో కోడ్‌ను చోప్రా అభివృద్ది చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube