నిన్న వరుణ్ తేజ్ పుట్టినరోజు కాగా నిన్నటినుంచి వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి గురించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి కాంబినేషన్ లో మిస్టర్, అంతరిక్షం 9000 kmph సినిమాలు తెరకెక్కాయి.
ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచాయి.అయితే వరుణ్ లావణ్య ప్రేమలో ఉన్నారని గతంలో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
మరోవైపు నిన్న వరుణ్ తేజ్ లావణ్యకు ప్రపోజ్ చేయనున్నారని ఇండస్ట్రీలో గాసిప్స్ గుప్పుమన్నాయి.
పాతిక లక్షల రూపాయల డైమండ్ రింగ్ ను కొనుగోలు చేసి బెంగళూరులో వరుణ్ తేజ్ లావణ్యకు ప్రపోజ్ చేయనున్నారని నెట్టింట వార్తలు వైరల్ అయ్యాయి.
అయితే వైరల్ అవుతున్న వార్తలకు లావణ్య త్రిపాఠి పరోక్షంగా చెక్ పెట్టారు.ప్రస్తుతం సొంతూరులో ఉన్న లావణ్య త్రిపాఠి ఆ ఫోటోలను షేర్ చేసి తాను బెంగళూరులో లేనని సొంతూరులో ఉన్నానని చెప్పకనే చెప్పేశారు.
మెగా ఫ్యామిలీ హీరోలలో చాలామంది హీరోలకు జోడీగా లావణ్య త్రిపాఠి నటించారు.వరుణ్ తేజ్ చెల్లి నిహారిక పెళ్లికి హాజరైన నటీమణులలో లావణ్య త్రిపాఠి ఒకరనే సంగతి తెలిసిందే.
నిన్న వరుణ్ తేజ్ బర్త్ డే సెలబ్రేషన్స్ కొరకు బెంగళూరుకు వెళ్లడంతో ఈ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.లావణ్య త్రిపాఠి క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో ఇకనైనా ఈ వార్తలు ఆగిపోతాయో లేదో చూడాల్సి ఉంది.
ప్రస్తుతం లావణ్య త్రిపాఠి డెహ్రాడూన్ లో ఉన్నారు.లావణ్య త్రిపాఠి ఫోటోలను షేర్ చేయడంతో పాటు ప్రకృతి అందాలు మనసును కట్టిపడేస్తున్నాయని చెప్పుకొచ్చారు.వైరల్ అవుతున్న ప్రేమ, పెళ్లి వార్తల గురించి లావణ్య త్రిపాఠి డైరెక్ట్ గా స్పందిస్తే బాగుంటుందని ఆమె అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం లావణ్య త్రిపాఠి చేతిలో సినిమా ఆఫర్లు ఎక్కువగా లేవనే సంగతి తెలిసిందే.