గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో క్రూయిజర్ ప్రమాదానికి గురైంది.వాహనంలో పది మంది ప్రయాణిస్తుండగా వారిలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
ఈ మేరకు స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు.దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
పోలీసుల వివరాల ప్రకారం… అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
క్రూయిజర్ ను గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటన తాడిపత్రి శివారు ప్రాంతంలో చోటు చేసుకుంది.చిత్తూరు జిల్లాలోని తిరుచానూరులో ఓ ఆధ్మాత్మిక గురువు మరణించడంతో ఆయన అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.
ఈ రోజు తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం వేగంగా వచ్చి క్రూయిజర్ ను ఢీకొంది.దీంతో క్రూయిజర్ లో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.వీరిలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.మిగిలిన క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
ఈ మేరకు డీఎస్పీ శ్రీనివాసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.మృతులు, క్షతగాత్రలందరూ తాడిపత్రికి చెందిన వారిగా గుర్తించారు.
అయితే ఈ ప్రమాదానికి కారణమైన వాహనం గురించి ఆరా తీస్తున్నామని, త్వరలో నిందితుడిని పట్టుకుని అరెస్ట్ చేస్తామని ఆయన పేర్కొన్నారు.