బాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది.సుశాంత్ ఆత్మహత్య గురించి విచారిస్తే డ్రగ్స్ భాగోతం వెలుగులోకి వచ్చింది.
దీంతో ఈ డ్రగ్స్ మాఫియా వెనుక ఎవరు ఉన్నారు, ఎవరి హస్తం ఉంది.రియాకి డ్రగ్స్ మాఫియాతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే విషయాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి ఇప్పటికే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో పోలీసులు రియా చక్రవర్తితో పాటు ఆమె తమ్ముడుని కూడా అరెస్ట్ చేశారు.
వీరిని అరెస్ట్ చేసి విచారించిన తర్వాత తాజాగా మరో ఐదు మందిని ఈ కేసులో అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే రియా చక్రవర్తిని ఇప్పుడు డ్రగ్స్ మాఫియా ఒక పావుగా వాడుకొని సుశాంత్ ని టార్గెట్ చేసిందా, దాని కోసం ఆమెతో సుశాంత్ పై హనీ ట్రాప్ చేయించారా అంటే అవుననే మాట ఓ బాలీవుడ్ నటి చెబుతుంది.
డ్రగ్స్ మాఫియా వాళ్ళు రియాని ఒక పావుగా వాడుకొని సుశాంత్ ని టార్గెట్ చేసి అతని జీవితాన్ని నాశనం చేశారని చెబుతుంది.సుశాంత్ మాజీ ప్రేయసి అంకిత లోఖండేల సన్నిహితురాలైన బాలీవుడ్ నటి ఆండ్రియా డిసౌజా సంచలన వ్యాఖ్యలు చేసింది.
సుశాంత్ కు స్లో పాయిజన్ కూడా ఇచ్చారని సదురు నటి సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఓ ఇంటర్వ్యూలో ఆమె సంచలన విషయాలను వెల్లడించారు.
బాలీవుడ్ డ్రగ్ మాఫియానే సుశాంత్ ను బలిగొందని, తాను కూడా ఈ డ్రగ్ పెడ్లర్ల బాధితురాలినే అని ఆమె చెప్పింది.అదృష్టవశాత్తూ దీని నుంచి బయటపడ్డానని, తన జీవితంలో ఇది ఒక భయంకరమైన దశ అని ఆమె పేర్కొన్నారు.
డ్రగ్స్ ముఠా బాధితురాలిగా ఉన్నానని, బాలీవుడ్ రెండవ పేరు డ్రగ్ అని ఆ నటి మీడియాకు తెలిపింది.ఈ డ్రగ్ ముఠాతో బాలీవుడ్ చాలా మంది పెద్ద పెద్ద ప్రముఖులు లింకులు కలిగి ఉన్నారని, కొత్తగా వచ్చిన వారిని ఆ డ్రగ్స్ మాఫియా వాళ్ళు, ఇండస్ట్రీ పెద్దలు పావులుగా వాడుకొని వాళ్ళకి నచ్చని వాళ్ళ మీదకి విడిచిపెడతారని పేర్కొంది.
ఓ పార్టీకి వెళ్ళినప్పుడు తనని కూడా డ్రగ్స్ తీసుకోవాలని, లేదంటే కెరియర్ నాశనం చేస్తామని బెదిరించారని ఆండ్రియా మీడియాతో సంచలన విషయాలు పంచుకుంది.మొత్తానికి బాలీవుడ్ డ్రగ్స్ మాఫియాకి సంబందించిన విషయాలని బయట పెట్టడానికి ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటకి వస్తున్నారని తెలుస్తుంది.