పట్టువదలని విక్రమార్కుడిలా మారిపోయారు టీడీపీ అధినేత చంద్రబాబు.2019 ఎన్నికల్లో ఓటమి చెందిన దగ్గర నుంచి చంద్రబాబు ఆ విధంగానే అన్ని విషయాల్లోనూ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తున్నారు.గతంలో టీడీపీ బీజేపీ పొత్తు పెట్టుకున్న సమయంలో, కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ తిరుగులేకుండా ఉండేది.కానీ ఆ తర్వాత ఈ రెండు పార్టీల మధ్య పొత్తు విఫలం కావడంతో, అక్కడి నుంచి చంద్రబాబుకు కష్టాలు మొదలయ్యాయి.
బాబుపై ద్వేషంతో జగన్ కు మద్దతుగా బీజేపీ కి పరోక్షంగా మద్దతుగా నిలబడడంతో పాటు, 2019 ఎన్నికల్లో వైసీపీ పై గెలిచేందుకు అన్ని రకాల సహాయాలు అందించింది అని, ఆ సహకారంతోనే అంత భారీ మెజారిటీ సంపాదించడానికి కారణం అని టీడీపీ లెక్కలు వేస్తోంది.

ఇక అన్ని మొహమాటాలు పక్కనపెట్టి బీజేపీకి దగ్గరయ్యేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా, ఏది వర్క్ ఔట్ అవ్వడం లేదు.బీజేపీతో స్నేహం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామనే సంకేతాలు పంపిస్తున్నా పట్టించుకోవడం లేదు సరికదా, గతం కంటే ఎక్కువగా టీడీపీని టార్గెట్ చేసుకుంటూ వ్యవహరిస్తున్న తీరు చంద్రబాబు లో భయాందోళనలు కలిగిస్తున్నాయి.బీజేపీ నాయకులు ఎంత ఘాటు పదజాలంతో తనను విమర్శించినా, బాబు మాత్రం ఎక్కడా బీజేపీ ని విమర్శించే సాహసం చేయలేకపోవడం చూస్తే, బీజేపీతో విరోధం కోరుకోవడం లేదని, స్నేహం మాత్రమే కోరుకుంటున్నామనే సంకేతాలు ఇస్తున్నారు.
అయినా బీజేపీ వైపు నుంచి రెస్పాన్స్ కనిపించడం లేదు.

ఇక బీజేపీ కేంద్రంలో తీసుకుంటున్న నిర్ణయాలు, పథకాలపైన పదే పదే ప్రశంసిస్తూ లేఖలు రాయడం, మీడియా సమావేశాల్లో మాట్లాడడం వంటివి చేస్తూ, మరింత దగ్గర అయ్యేందుకు ప్రయత్నిస్తున్నా, ఫలితం కనిపించడం లేదు.తాజాగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఎన్డీయే అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్ కు టీడీపీ మద్దతు ఇచ్చింది.రాజ్యసభలో టీడీపీకి ఉన్న ఏకైక రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ కు మద్దతుగా ఓటు వేశారు.
రాజ్యసభ లో ఒక్కో ఓటు ఎంతో కీలకంగా మారిన పరిస్థితుల్లో, టీడీపీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి కి ఓటు వేయడం ద్వారా, బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది.
ఈ విషయంలో గతంలో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ ను సైతం పక్కన పెట్టేసింది.
ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వానికి బీజేపీ అన్ని విధాలుగా సహకరిస్తూ ఉండడం, సీబీఐ ని రంగంలోకి దించి లోకేష్ అవినీతి వ్యవహారాలపై దర్యాప్తు చేయించేందుకు వైసీపీ ప్రభుత్వానికి సహకరిస్తున్నా, ఈ కారణాలు మరింతగా కలవరపెడుతున్నాయి.అందుకే గతంలో బీజేపీని తాను విమర్శించిన విషయాలన్నిటినీ మరిచిపోయి మరీ చంద్రబాబు పదేపదే ఆ పార్టీతో పొత్తు కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు.
కాకపోతే అటువైపు నుంచి సరైన రెస్పాన్స్ రాకపోయినా, తన ప్రయత్నాలు మాత్రం మారడం లేదు.అయినా బాబు మాత్రం విక్రమార్కుడిలా బీజేపీ వెంటపడుతున్నాడు.