శరీరానికి అల్పాహారం( Breakfast ) ఎంతో ముఖ్యమైనది.పండ్లు, జ్యూస్, స్నాక్స్ ను టిఫిన్ గా తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.
ఇక ప్రతిరోజు టిఫిన్ చేయడం చాలా ముఖ్యం.అయితే పోషకాలు అధికంగా ఉండే పదార్థాలు తీసుకోవడం వలన ఆరోగ్యానికి మంచి లాభాలు ఉంటాయి.
కానీ బ్రేక్ ఫాస్ట్ లో మాత్రం కొన్ని ఆహార పదార్థాలను దూరంగా ఉంచాలని అంటున్నారు నిపుణులు.లేదా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.
ఉదయం పూట ఖాళీ కడుపుతో కొన్ని పదార్థాలు తీసుకోవడం వలన అవి ఆరోగ్యానికి హానికరంగా మారుతాయి.అయితే ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఏ ఆహారాన్ని తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
చాలామంది ఉదయాన్నే పరగడుపుతో పండ్లు, కూరగాయలు తింటూ ఉంటారు.ఇలాంటివి తీసుకోవడం వలన కడుపు సమస్యలు, అలసట ఏర్పడుతుంది.ఉదయం ఖాళీ కడుపుతో టిఫిన్, కీర దోసకాయలను( Cucumber ) తినడం మానేయాలి.ఇలా చేయడం వలన ఇది ప్రేగు సమస్యలను కూడా పెంచుతుంది.ఇక ఉదయం పూట ఫైబర్ తీసుకొనే ముందు కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది.అంతేకాదు ఉదయం పూట ఖాళీ కడుపుతో నారింజ పండు తినడం వలన కూడా మంచిది కాదు.
ఇలా తినడం వలన ఎసిడిటీ కలుగుతుంది.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో నారింజ పండ్లను( Oranges ) తినడం వలన యాసిడ్ రిఫ్లెక్స్, జీర్ణశయాంతర సమస్యలు వస్తాయి.ఇక ఇతర ఆహారాలతో కూడా నారింజ పండును కలిపి తీసుకోకూడదు.ఇలా తీసుకోవడం వలనా రక్తంలో చక్కెర స్థాయి నిర్వహిస్తుంది.
అంతేకాకుండా ఉదయం ఖాళీ కడుపుతో బిస్కెట్లు కూడా తినకూడదు.ఎందుకంటే ఇందులో ఫైబర్ పోషకాలు ఉండవు ఇందులో ఉన్న కార్బోహైడ్రేట్స్ రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి.
దీని వలన ఆరోగ్య సమస్యలు వస్తాయి.అంతేకాకుండా అధికంగా బరువు కూడా పెరుగుతారు.