గోవా బ్యూటీ ఇలియానా( Ilean ) మరికొద్ది రోజులలో ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు.ఇలా ఈమె పెళ్లికాకుండానే ప్రెగ్నెంట్ అంటూ తన ప్రెగ్నెన్సీ విషయాన్ని ప్రకటించడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు.
మొత్తానికి తన ప్రేగ్నెన్సీ( Pregency ) విషయాన్ని తెలియచేయడమే కాకుండా తరచూ తన ప్రేగ్నెన్సీ సమయంలో తనకు కలిగే అనుభవాలు గురించి ఈమె ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.ఇలా అన్ని సవ్యంగా ఉన్నప్పటికీ తన ప్రెగ్నెన్సీకి కారణమైనటువంటి వ్యక్తిని మాత్రం ఇలియానా ఇప్పటివరకు పరిచయం చేయలేదు.
తరచూ ఇలియానా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు అన్న ప్రశ్న మాత్రం తనకు ఎదురవుతూనే ఉంది.
ఇకపోతే ఈమె పలు సందర్భాలలో తన ప్రియుడిని అందరికీ పరిచయం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ ఇప్పటివరకు ఎక్కడా కూడా తన ప్రెగ్నెన్సీకి కారణమైనటువంటి ఆ వ్యక్తి ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు.అయితే తాజాగా మరోసారి తన కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డకు తండ్రి ఎవరు అనే విషయం గురించి ఇలియానా స్పందిస్తూ తన బిడ్డ తండ్రి ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.దీంతో ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయితే ఎప్పటిలాగే ఇలియానా ఆ వ్యక్తి ఫేస్ మాత్రం ఈ ఫోటోలో కూడా రివిల్ చేయకపోవడం గమనార్హం.
ఈ క్రమంలోనే ఇలియానా తన ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా తన కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డకు తండ్రి అయిన తన ప్రియుడు పెంపుడు కుక్కతో ఆడుకుంటూ ఉన్నటువంటి ఫోటోని షేర్ చేశారు.అయితే ఈ ఫోటోలు ఎక్కడ కూడా తన ప్రియుడి ఫేస్ మాత్రం కనిపించకుండా జాగ్రత్త పడ్డారు.ఇలా తరచు తన బాయ్ ఫ్రెండ్ ( Boy Friend ) అస్పష్టమైన చిత్రాలను షేర్ చేస్తూ అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తుంది.
ఏది ఏమైనా ఇలియానా ప్రెగ్నెన్సీ విషయంలో మాత్రం నేటిజెన్లకు ఎన్నో సందేహాలు ఉన్నాయని చెప్పాలి.త్వరలోనే వాటన్నింటికీ ఇలియానా ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారని తెలుస్తుంది.ఇక ఇలియానా తరచూ తన బేబీ బంప్ ( Baby Bump Photos ) ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే.