అధిక రక్తపోటు( high blood pressure ).దీన్నే హై బీపీ, హైపర్ టెన్షన్ అని కూడా పిలుస్తాము.
ఇటీవల కాలంలో స్త్రీ పురుషులు అనే తేడా లేకుండా ఎంతో మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు.ఇది చిన్న సమస్యగానే అనిపించినా అత్యంత ప్రమాదకరమైనది.
అధిక రక్తపోటు వల్ల తీవ్రమైన తలనొప్పి, కళ్ళు మసక బారడం, ఛాతిలో నొప్పి తదితర సమస్యలు తలెత్తుతాయి.అలాగే అధిక రక్తపోటును నిర్లక్ష్యం చేస్తే గుండెపోటు వచ్చే రిస్క్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.
అందుకే అధిక రక్తపోటును అదుపులోకి తెచ్చుకోవడం ఎంతో అవసరం.అయితే అందుకు కొన్ని కొన్ని ఆహారాలు అద్భుతంగా సహాయపడతాయి.అటువంటి వాటిల్లో ఖర్జూరం ( date palm ) ఒకటి.అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు ఖర్జూరంను ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే సులభంగా ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చు.
రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు అరగంట ముందు నాలుగు ఖర్జూరాలను తీసుకుని రెండు స్పూన్ల నెయ్యిలో వేసి కలిపి తీసుకోవాలి.

ఖర్జూరం నెయ్యి కాంబినేషన్ ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తుంది.ఖర్జూరంలో పొటాషియం, మెగ్నీషియం( Potassium, magnesium ) వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.ఇవి రక్తపోటును కంట్రోల్ చేయడానికి చక్కగా తోడ్పడతాయి.
అలాగే నెయ్యికి కూడా అధిక రక్తపోటును కంట్రోల్ చేసే సామర్థ్యం ఉంది.అందువల్ల ఈ రెండిటినీ కలిపి రోజు ఉదయం పూట తీసుకుంటే రక్తపోటు స్థాయిని అదుపులో ఉంచుకోవచ్చు.
పైగా ఖర్జూరంను నెయ్యితో కలిపి తీసుకుంటే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది.గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

అలాగే మార్నింగ్ టైం లో నాలుగు ఖర్జూరాలను నెయ్యితో కలిపి తీసుకోవడం వల్ల రోజంతా ఫుల్ ఎనర్జిటిక్ గా ఉంటారు.రక్తహీనత ఉంటే దూరం అవుతుంది.ఖర్జూరం నెయ్యి ఈ రెండింటిలోనూ యాంటీ ఆక్సిడెంట్స్ మెండుగా ఉంటాయి.అందువల్ల ఈ రెండిటినీ కలిపి తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.ఫలితంగా అనేక సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.