టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ ముక్క చెక్కలు చాలా కాలం అయ్యింది అన్న విషయం తెలిసిందే.ఎవరి వ్యాపారం వాళ్ళది,ఎవరి స్వార్థం వాళ్ళది, అన్నట్టుగా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంటున్నారు.
ఒకప్పుడు ఏదైనా మంచి జరిగితే విబేధాలు పక్కనపెట్టి కలుసుకునేవారు, సెలబ్రేట్ చేసుకునేవారు.కానీ ఆ రోజులు పోయాయి.
ఎవరి గ్రూపులు వాళ్లవి, ఎవరి మనుషులు వాళ్లకే.ఒక పెద్ద సందర్భం వచ్చినప్పుడు కలిసి సెలబ్రేట్ చేసుకోవాలనే ఆలోచన కూడా ఎవ్వరూ చేయడం లేదు.
ఆ దిశగా చొరవ తీసుకునే వ్యక్తులు కూడా తగ్గిపోయారు.అయితే మొన్నటికి మొన్న అల్లు అర్జున్ కు జాతీయ అవార్డ్ వస్తే టాలీవుడ్ స్పందన ఎలా ఉందో అందరం చూశాం.

సెలబ్రేట్ చేయాల్సిన సందర్భాన్ని ప్రెస్ నోట్లకు పరిమితం చేశారు.అంతకంటే ముందు ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ స్థాయికి వెళ్తే, పండగ చేసుకోవాల్సింది పోయి, టాలీవుడ్ లో ఒక రకమైన నిశ్శబ్ద వాతావరణం కనిపించింది.మెజారిటీ వ్యక్తులు, సంస్థలు ట్వీట్లు వేసి మమ అనిపించారు.ఆ తర్వాత ఒక ఫంక్షన్ పెట్టినా టాలీవుడ్ కు సంబంధం లేదనట్టు జరిగిందది.సినిమాలు పెద్ద సక్సెస్ సాధించినప్పుడు ఫంక్షన్లు చేసుకోవడం చేసుకోకపోవడం వాళ్ల ఇష్టం.కలిసిరావాల్సిన వాళ్లు వచ్చినా, రాకున్నా అది వాళ్ల వ్యక్తిగతం.
కానీ జాతీయ అవార్డు, ఆస్కార్ అవార్డు( National Award, Oscar Award ) లాంటి ఘనతల్ని కూడా పట్టించుకోకపోతే ఎలా? అన్న ప్రశ్న చాలా మంది మదిలో మెలిగింది.

మరి అదంతా గతం జరిగిపోయింది.ఇప్పుడు తాజాగా మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi ) పద్మ విభూషణ్ వరించింది.ఇది నిజంగా టాలీవుడ్ ఇండస్ట్రీ అందరూ గర్వించదగ్గ విషయం.
కనీసం ఈసారైనా టాలీవుడ్ కలవాలి.అందరూ కలిసిరావాలి.
హీరోలంతా ఒకే వేదికపైకి రావాలి.లెజండ్ ఎవరు సెలబ్రిటీ ఎవరు లాంటి వాదనలు పక్కనపెట్టాలి.
ఎవరి ఫ్యాన్ బేస్ ఎంత, ఎవరి సినిమాకు ఎన్ని వసూళ్లు వచ్చాయనే లెక్కల్ని కాసేపు మరిచిపోవాలి.చిరంజీవికి పద్మవిభూషణ్( Padmavibhushan ) ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఆయన సేవల్ని గుర్తించింది.
టాలీవుడ్ కూడా చిరంజీవికి అలాంటి గౌరవం ఇవ్వాల్సిన సమయం వచ్చింది.చిరంజీవిని ఘనంగా సత్కరించడం ద్వారా, టాలీవుడ్ లో తామంతా ఒకటే అని అందరికీ చాటిచెప్పడానికి ఇదొక మంచి సందర్భం.
చిరంజీవి కోసమైనా కోపతాపాలు అన్ని పక్కన పెట్టి టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా ఒకటవుతుందో లేదో చూడాలి మరి.







