గురు పౌర్ణమి రోజున చేయాల్సిన చేయకూడని పనులు ఇవే..!

గురు పౌర్ణిమ( Guru Poornima ) రోజున గురువులను, పెద్దలను ఈ రోజున పూజిస్తారు.

ఆది యోగి, ఆది గురువైన మహా శివుడు ఆషాడ పౌర్ణమి రోజు సప్త ఋషులకు జ్ఞాన బోధ చేశాడని శివపురాణం చెబుతున్నది.

ఆషాడ పౌర్ణమి దత్తాత్రేయుడు ( Dattatreya )తన శిష్యులకు జ్ఞానబోధ చేసిన రోజుగా దత్త చరిత్ర చెబుతుంది.

వ్యాస మహాముని ఈరోజున సత్యవతి పరాశరా మహర్షికి జన్మించాడని, కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఇదే రోజున వేదాన్ని బుగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదాలుగా విభజించాడని పండితులు చెబుతున్నారు.

ఈ పుణ్య విశేషమును పురస్కరించుకొని ఆషాడ పూర్ణమి రోజు గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ ను జరుపుకుంటారు.

"""/" / గురు పూర్ణిమ రోజు చేయాల్సిన పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

గురు పూర్ణిమ రోజున లక్ష్మీనారాయణ( Lakshminarayana ) ఆలయంలో కొబ్బరికాయ కొట్టాలి.ఈ రోజున విష్ణువును పూజించి మీ శక్తి మేరకు దానం చేయాలి.

ఈరోజున పసుపు, మిఠాయిలు, దానం చేస్తే మంచిది.ఇలా చేయడం వల్ల జాతకం లో గరు దోషం దూరమవుతుంది మీకు డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే గురు పూర్ణిమ రోజు అవసరమైన వారికి శనగపప్పు దానం చేయాలి.

సాయంత్రం వేళలలో భార్యాభర్తలు కలిసి చంద్రుని దర్శనం చేసుకుని పూజిస్తే వారి దాంపత్య జీవితంలో ఆటంకలు దూరం అయిపోతాయి.

"""/" / ఇంకా చెప్పాలంటే పౌర్ణమి సాయంత్రం తులసి మొక్క ముందు ఆవు నెయ్యి తో దీపం వెలిగించడం వల్ల అదృష్టం కలుగుతుంది.

అలాగే గురు పౌర్ణమి రోజున చేయకుడనీ పనుల గురించి తెలుసుకుందాం.ఈ రోజునా ఇంటికి వచ్చిన బిచ్చగాళ్లను ఖాళీ చేతులతో వెనక్కి పంపకూడదు.

ఈ రోజునా పేదలకు లేదా అవసరం ఉన్నవారికి వస్తువులను దానం చేయడం ద్వారా రెట్టింపు పుణ్యాన్ని పొందవచ్చు.

గురు పౌర్ణమి రోజున పెద్ద వారిని అలాగే మహిళలను పొరపాటున కూడా అవమానించకూడదు.

వెంకటేష్ ఈ సంక్రాంతి విన్నర్ నిలిచాడా..?