ప్రస్తుత రోజుల్లో చాలా మంది చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులతో( Knee pain ) బాధపడుతున్నారు.ఇందుకు కారణాలు అనేకం.
పోషకాల కొరత, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, గంటల తరబడి నిలబడి పని చేయడం, అధిక బరువు తదితర కారణాల వల్ల మోకాళ్ళ నొప్పి బారిన పడుతుంటారు.ఈ క్రమంలోనే మోకాళ్ళ నొప్పులను వదిలించుకోవడం కోసం ఎన్నెన్నో మందులు వాడుతుంటారు.
మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే అస్సలు వర్రీ అవ్వకండి.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే పొడిని ప్రతిరోజు పాలతో కలిపి తీసుకుంటే మోకాళ్ళ నొప్పి అన్నమాటే అనరు.మరి ఇంకెందుకు ఆలస్యం మోకాళ్ళ నొప్పులను తరిమికొట్టే ఆ పొడిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు అవిసె గింజల( Flaxseed )ను వేసి బాగా వేయించుకోవాలి.ఆ తర్వాత అదే పాన్ లో ఒక కప్పు కొబ్బరి పొడి వేసి స్లైట్ గా వేయించాలి.చివరిగా అరకప్పు పిస్తా పప్పు వేసి వేయించుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో అవిసె గింజలు, పిస్తా పప్పు మరియు ఆరు నుంచి ఎనిమిది యాలకులు వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.
చివరిగా ఈ పౌడర్ లో వేయించి పెట్టుకున్న కొబ్బరి పొడి మరియు ఒకటిన్నర కప్పు బెల్లం పొడి( Jaggery powder ) వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

తద్వారా మన పొడి సిద్ధం అయినట్టే.ఈ పొడిని ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.ప్రతిరోజు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో తయారు చేసుకున్న పొడిని వన్ టేబుల్ స్పూన్ చొప్పున కలిపి సేవించాలి.
ఇలా చేస్తే మోకాళ్ల నొప్పి అన్న మాటే అనరు.ఈ పొడిలో ఉండే పలు పోషకాలు ఎముకలను దృఢంగా మారుస్తాయి.మోకాళ్ళ నొప్పులను నివారిస్తాయి.కాబట్టి మోకాళ్ళ నొప్పి తో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ పొడిని తయారు చేసుకుని వాడెందుకు ప్రయత్నించండి.