టీడీపీ,( TDP ) జనసేన( Janasena ) పార్టీల మధ్య పొత్తు ఫిక్స్ కావడంతో ఈ రెండు పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులు తెగ సంతోషిస్తున్నారు.అయితే టీడీపీ జనసేన కలిసినా సీమలో వైసీపీదే( YCP ) హవా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.రాయలసీమలో 2019 ఎన్నికల ఫలితాలే 2024లో కూడా రిపీట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.2019 ఎన్నికల్లో రాయలసీమలో 49 నియోజకవర్గాల్లో వైసీపీ ఘనవిజయం సాధించింది.
రాయలసీమలో మొత్తం 52 నియోజకవర్గాలు ఉండగా 49 నియోజకవర్గాల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది.సీమలో 94 శాతం ఓటు బ్యాంక్ తో చరిత్ర సృష్టించింది.టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసినా విడివిడిగా పోటీ చేసినా పెద్దగా ప్రభావం చూపే అవకాశం అయితే లేదని సమాచారం అందుతోంది.రాయలసీమపై టీడీపీ, జనసేన దృష్టి పెడితే బెటర్ అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

జనసేన రాయలసీమలో( Rayalaseema ) ఎక్కువ స్థానాల్లో పోటీ చేసే ఛాన్స్ కూడా లేదని తెలుస్తోంది.తిరుపతి, అనంతపురం నియోజకవర్గాల్లో మాత్రమే రాయలసీమలో జనసేన పోటీ చేసే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.వైసీపీ మాత్రం రాయలసీమలో మరోసారి సంచలనాలు సృష్టించడం ఖాయమని కామెంట్లు జోరుగా వినిపిస్తుండటం గమనార్హం.

టీడీపీ జనసేన పొత్తు ఫిక్స్ అయిన నేపథ్యంలో వైసీపీ ఎలాంటి వ్యూహాలతో ముందుకెళుతుందో చూడాల్సి ఉంది.టీడీపీ జనసేన పొత్తు ఆ పార్టీలకు ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో చూడాల్సి ఉంది.ఈ పార్టీలు 2024 ఎన్నికల్లో( AP 2024 Elections ) సంచలనాలు సృష్టించడం గ్యారంటీ అని పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ తో ఉన్నాయి.
ఏపీ సీఎం వైఎస్ జగన్( CM Jagan ) టీడీపీ నేతల విషయంలో ఒకింత దూకుడుతో వ్యవహరిస్తున్నారు.అదే సమయంలో సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
సంక్షేమ పథకాలే తనను మరోసారి గెలిపించడం గ్యారంటీ అని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఫీలవుతున్నారు.