వరంగల్ కాకతీయ యూనివర్సిటీ( Kakatiya University ) క్యాంపస్ లో ర్యాగింగ్ వ్యవహారం కలకలంగా మారింది.యూనివర్సిటీ లేడీస్ హాస్టల్ లో పరిచయ కార్యక్రమం పేరున సీనియర్ విద్యార్థినీలు జూనియర్లను ఇబ్బందులకు గురి చేయడం జరిగింది.
ఈ సమయంలో వెకిలి చేష్టలకు పాల్పడటంతో అది కాస్త వివాదంగా మారింది.యూనివర్సిటీ ఉన్నతాధికారుల దృష్టి దాక వెళ్ళటం జరిగింది.
దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు.ర్యాగింగ్ ఘటనపై విచారణ చేసి.
ర్యాగింగ్ కి పాల్పడిన మొత్తం 81 మంది అమ్మాయిలపై వారం రోజులపాటు సస్పెన్షన్ వేటు వేశారు.సస్పెన్షన్ కి గురైన వారిలో.
పీజీ స్టూడెంట్స్ 28 మంది, కామర్స్ స్టూడెంట్స్ 28 మంది, ఎకనామిక్స్ చదువుతున్న 25 మంది, జువాలజీ సెకండియర్ విద్యార్థినీలు ఉన్నారు.
కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థినీలకు ఐదు హాస్టల్స్ ఏర్పాటు చేశారు.
ఈ హాస్టల్ లో ఐదు బ్లాకులు విద్యార్థినీల కోసం కేటాయించగా కొత్తగా వివిధ కోర్సుల్లో చేరిన విద్యార్థినీలను.పద్మాక్షి బ్లాక్, ఏ బ్లాక్ వద్ద కొందరు సీనియర్లు.
జూనియర్ విద్యార్థినీలను.ఇబ్బందులకు గురి చేయటం జరిగింది.
సెల్ఫ్ డీటెయిల్స్ కార్యక్రమం పేరిట మొదలుపెట్టి తర్వాత ఇష్టానుసారమైన ప్రశ్నలతో.జూనియర్లను సీనియర్లు వెటకారం చేస్తూ వెకిలి చేష్టలతో ఏడిపించారట.
దీంతో వెంటనే ర్యాగింగ్ కి గురైన జూనియర్ లు… యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు.ఈ క్రమంలో విచారణ జరిపిన యూనివర్సిటీ అధికారులు ర్యాగింగ్ నిజమేనని( Raging ) విచారణలో తేలడంతో.
పెద్ద మొత్తంలో 81 మంది సీనియర్ అమ్మాయిలను వారం రోజులపాటు సస్పెండ్ చేయటంతో యూనివర్సిటీలో హాట్ టాపిక్ గా మారింది.







