ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు నెలలలో ఎన్నికలు( AP Elections ) జరగనున్నాయి.ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ( YCP ) 2024 ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది.
ఈ క్రమంలో ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్( CM Jagan ) ఎప్పటికప్పుడు నాయకులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు.ఈ సమావేశాలలో పలు సూచనలు చేస్తున్నారు.
మరోపక్క ప్రజా వ్యతిరేకత కలిగిన నాయకులను పక్కన పెట్టేసి కొత్త వారిని ఇన్చార్జిలుగా నియమిస్తున్నారు.ఈ విషయం నడుస్తూ ఉండగానే నాయకులను పక్కన పెట్టకు ముందు.
నియోజకవర్గాలలో అభ్యర్థులు మార్పులు చేర్పులు చేయకముందు సదరు నేతలను జగన్ పిలిచి మాట్లాడుతూ ఉన్నారు.
ఇదే రకంగా నేడు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి( Balineni Srinivasa Reddy ) సీఎం జగన్ తో భేటీ కావడం జరిగింది.ఈ భేటి అనంతరం బాలినేని కీలక వ్యాఖ్యలు చేశారు.రానున్న ఎన్నికలలో తాను ఒంగోలు( Ongole ) నుంచే పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేయడం జరిగింది.
ఇదే సమయంలో కొన్ని నియోజకవర్గాలకు వెళ్లి పరిశీలించాలని కూడా సీఎం జగన్ సూచించినట్లు తెలిపారు.
గిద్దలూరులో అన్నా రాంబాబు( Anna Rambabu ) పోటీ చెయ్యకపోవటంతో ఆ స్థానంలో పోటీ చేసే అభ్యర్థి ఎవరనేది రేపు తేలుతుంది.అభ్యర్థుల ఖరారు ప్రక్రియ రేపు పూర్తవుతుంది.అనంతరం సీఎం జగన్ పేర్లు ప్రకటిస్తారు అని బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.