రేపే వైసీపీ అభ్యర్థుల జాబితా…బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు నెలలలో ఎన్నికలు( AP Elections ) జరగనున్నాయి.

ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ( YCP ) 2024 ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది.

ఈ క్రమంలో ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్( CM Jagan ) ఎప్పటికప్పుడు నాయకులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ఈ సమావేశాలలో పలు సూచనలు చేస్తున్నారు.మరోపక్క ప్రజా వ్యతిరేకత కలిగిన నాయకులను పక్కన పెట్టేసి కొత్త వారిని ఇన్చార్జిలుగా నియమిస్తున్నారు.

ఈ విషయం నడుస్తూ ఉండగానే నాయకులను పక్కన పెట్టకు ముందు.నియోజకవర్గాలలో అభ్యర్థులు మార్పులు చేర్పులు చేయకముందు సదరు నేతలను జగన్ పిలిచి మాట్లాడుతూ ఉన్నారు.

"""/" / ఇదే రకంగా నేడు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి( Balineni Srinivasa Reddy ) సీఎం జగన్ తో భేటీ కావడం జరిగింది.

ఈ భేటి అనంతరం బాలినేని కీలక వ్యాఖ్యలు చేశారు.రానున్న ఎన్నికలలో తాను ఒంగోలు( Ongole ) నుంచే పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేయడం జరిగింది.

ఇదే సమయంలో కొన్ని నియోజకవర్గాలకు వెళ్లి పరిశీలించాలని కూడా సీఎం జగన్ సూచించినట్లు తెలిపారు.

"""/" / గిద్దలూరులో అన్నా రాంబాబు( Anna Rambabu ) పోటీ చెయ్యకపోవటంతో ఆ స్థానంలో పోటీ చేసే అభ్యర్థి ఎవరనేది రేపు తేలుతుంది.

అభ్యర్థుల ఖరారు ప్రక్రియ రేపు పూర్తవుతుంది.అనంతరం సీఎం జగన్ పేర్లు ప్రకటిస్తారు అని బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.