మంగళగిరిలో జయహో బీసీ సభ( Jayaho BC Public Meeting )కి తెలుగుదేశం జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు నాయకులు భారీ ఎత్తున హాజరయ్యారు.ఈ కార్యక్రమానికి చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ లతో పాటు రెండు పార్టీల ప్రధాన నాయకులు… నారా లోకేష్( Nara Lokesh ) కూడా హాజరు కావడం జరిగింది.
ఈ సందర్భంగా లోకేష్ సంచలన స్పీచ్ ఇచ్చారు.మంగళగిరిలో గత ఎన్నికలలో స్వల్ప మెజారిటీతో ఓడిపోయినట్లు పేర్కొన్నారు.
బీసీలకు అధిక ప్రాధాన్యత కల్పించిన రాజకీయ పార్టీ తెలుగుదేశం అని గుర్తు చేశారు.బీసీ వర్గాలకు ప్రోత్సాహాలు కల్పిస్తూ తెలుగుదేశం హయాంలో అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
వైసీపీ వచ్చాక బీసీలకు అన్యాయం జరిగిందని లోకేష్ ఆరోపించారు.ఈ క్రమంలో పాదయాత్రలో బీసీలకు జరిగిన అన్యాయాన్ని గుర్తించినట్లు తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే.న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.బీసీలు అంటే బలహీనులు కాదు.బలవంతులని పేర్కొన్నారు.బీసీల పట్ల తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ధి ఉంది.
టీడీపీ( TDP )తోనే వారికి న్యాయం జరుగుతుంది.గతంలో బీసీల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టాం.
కానీ బీసీలు అంటే జగన్ కి చిన్న చూపు.వైసీపీ ప్రభుత్వం బీసీ నేతలను వేధిస్తోంది.
అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపుతోంది.టీడీపీ – జనసేన కూటమి( TDP and Janasena )అధికారంలోకి రాగానే వారి సమస్యలు పరిష్కరిస్తాం అని లోకేష్ హామీ ఇచ్చారు.