తమిళ సినిమా ( Tamil movie ) ఇండస్ట్రీ తో పోలిస్తే మిగతా సినిమా ఇండస్ట్రీలు చాలా క్లియర్ అని చెప్పాలి.ఎందుకంటే తమిళ రాజకీయాలు మరియు అక్కడి సినిమాలకు అవినాభావ సంబంధం ఉంటుంది.
అక్కడి నటీనటులు రాజకీయాలను శాసిస్తారు, అలాగే రాజకీయ నాయకులు సినిమాలను శాసిస్తారు.ఈ రెండు విడదీయలేని బంధం కలిగినటువంటి వృత్తులు.
అయితే కొన్నిసార్లు సినిమా ఇండస్ట్రీలో ఉండే పెద్దలు మరియు నిర్మాతలు ఒక్కటిగా కలిసి ముక్కుసూటిగా కూడా వ్యవహరిస్తుంటారు.తమ దాకా వస్తే ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఏ విధంగాను వెనకాడరు.
అలాంటి ఒక నిర్ణయమే ప్రస్తుతం జరిగినట్టుగా తెలుస్తుంది ఇంకా అఫీషియల్ గా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు కానీ ఐదుగురు నటులను సినిమా ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేస్తున్నట్టుగా ఒక సామూహిక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది.

ఆ 5గురు నటులు మరెవరో కాదు తమిళ స్టార్ హీరోలైన శింబు, విశాల్, ఎస్ జే సూర్య, యోగి బాబు( Simbu, Vishal, SJ Surya, Yogi Babu ) మరియు అధర్వ( Atharva ).ఇది ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా వైరల్ గా మారింది ఎందుకంటే విషయాలు చెంబు వంటి స్టార్ హీరోలను ఇండస్ట్రీ బ్యాన్ చేయడం వెనక కారణాలు ఏమి ఉంటాయి అనే వెతుకులాట సోషల్ మీడియాలో మొదలైంది.ఇక అసలు విషయంలోకి వెళితే ఈ ఐదుగురు నటులు కూడా రకరకాల సినిమాల కోసం డబ్బులు అడ్వాన్స్ గా తీసుకొని డేట్స్ మాత్రం ఇవ్వకుండా నిర్మాతలను ఇబ్బంది పెడుతున్నారట.
నిర్మాత బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది అలాంటి నిర్మాతను ఏడిపిస్తున్న వారు ఇండస్ట్రీకి అవసరం లేదు అని సామూహికంగా తమిళ సినిమా ఇండస్ట్రీ అందరూ నిర్మాతలు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

ఇక ఈ ఐదుగురిలో శింబు కి మొదటి నుంచి వివాదాలు కొత్తేమి కాదు.ఆయన ఏ సినిమాలో నటిస్తే ఆ సినిమాకు సంబంధించిన నిర్మాత దర్శకుడు రకరకాలుగా ఇబ్బందులకు గురవుతూనే ఉంటారు.ఇక ఈ లిస్ట్ లో విశాల్ కూడా ఉండటం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం .ఎందుకంటే విశాల్ చాలా నెమ్మదస్తుడు కానీ కాస్త రాజకీయాలకు, ప్రలోభాలకు లొంగిపోతున్నాడు.యోగి బాబు లాంటి కమెడియన్ కూడా ఈ లిస్టులో ఉన్నాడు.
ఈ మధ్యకాలం లోనే హీరోగా సినిమాలు చేస్తున్న యోగి ఆటిట్యూడ్ పరంగా మాత్రం హీరోలను మించి పోతున్నాడు అనే టాక్ వినిపిస్తోంది.ఇక ఆ తర్వాత కూడా ఈ విషయంలో ఏం తక్కువ తినలేదు దర్శకుడు మరియు నటుడు అయిన ఎస్ జె సూర్య కూడా ఈ కోవలోనే ఉండడం విశేషం
.






