తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్లారు.రేపు రాష్ట్రపతి భవన్ లో ఎన్టీఆర్ వంద రూపాయలు నాణెం విడుదల కార్యక్రమానికి హాజరు కానున్నారు.
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ నాణాన్ని ముద్రించడం జరిగింది.ఢిల్లీలో సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేయబోతున్నారు.
అయితే ఈ కార్యక్రమం అనంతరం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషనర్ తో చంద్రబాబు భేటీ కాబోతున్నారు.రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఓట్ల తొలగింపు ఘటనలపై చంద్రబాబు ఫిర్యాదు చేయబోతున్నట్లు సమాచారం.
ఇక ఇదే సమయంలో రేపు వైసీపీ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయ్ సాయి రెడ్డి వైసీపీ ఎంపీలు కూడా కేంద్ర ఎన్నికల కమిషనర్ తో బేటి కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఇటీవల వైసీపీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మద్దతుదారుల ఓట్లను తొలగించినట్లు టీడీపీ నాయకులు ఆరోపణలు చేయటం తెలిసిందే.ఇదే సమయంలో వైసీపీ నేతలు రాష్ట్రంలో దొంగ ఓట్లు చంద్రబాబు సృష్టించి వాటి ద్వారానే గతంలో జరిగిన ఎన్నికలలో ఆయన గెలిచినట్లు ఆరోపణలు చేశారు.దీంతో రేపు అటు చంద్రబాబు ఇటు విజయసాయిరెడ్డి ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషనర్ తో భేటీకి రెడీ కావడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.