దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా నేడు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో తొలుత పోలింగ్ ప్రారంభమైంది.మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 230 స్థానాలకు ఓకే విడతలో ఎన్నికలు జరిగాయి.
ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు బారులు తీరారు.సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించడం జరిగింది.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో రెండో విడత పోలింగ్ నిర్వహించడం జరిగింది.ఛత్తీస్‌గఢ్ లో తొలి విడుదల ఈనెల ఏడవ తారీఖున 20 నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించారు.
మిగిలిన 70 నియోజకవర్గాలకు రెండవ దశలో శుక్రవారం ఎన్నికలు జరిగాయి.
ఈ రెండు రాష్ట్రాలలో ఎన్నికలు అనంతరం కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ తన అంచనాలను వెల్లడించారు.ఈసారి కాంగ్రెస్ పాలిత రాజస్థాన్ రాష్ట్రంలో సైతం బీజేపీ విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు.ఛత్తీస్‌గఢ్ లో మెజార్టీ స్థానాలు గెలుస్తామని చెప్పుకొచ్చారు.
అదేవిధంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అధికారం నిలబెట్టుకుంటుందని వ్యాఖ్యానించారు.మిజోరం, తెలంగాణ విషయంలో స్పష్టత లేదు.
కానీ తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తే వాస్తవ పరిస్థితి పై ఓ అంచనాకు రావచ్చని పీయూష్ గోయెల్ స్పష్టం చేయడం జరిగింది.ఇదిలా ఉంటే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు డిసెంబర్ మూడో తారీకు విడుదల కానున్నాయి.
ఈ క్రమంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలలో జాతీయ పార్టీలు ఇంకా స్థానిక పార్టీలు భారీ ఎత్తున ప్రచారంలో పాల్గొనబోతున్నాయి.