ఇటీవల కాలంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు జోరందుకున్నాయి.ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు, రాష్ట్రస్థాయి నాయకులు, ఇటీవల ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో చేరిపోతున్నారు.
దీంతో బీఆర్ఎస్ రోజురోజుకు బలహీనమైన పరిస్థితి నెలకొంది.దీంతో పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చేలా పార్టీ మారాలనే ఆలోచనతో ఉన్నవారి నిర్ణయానికి బ్రేక్ పడే విధంగా బీఆర్ఎస్ వ్యవహాత్మకంగా ఎత్తుగడలు వేస్తోంది .దీనిలో భాగంగానే పార్టీ మారిన ఎమ్మెల్యేల పై లీగల్ గా ఫారాడేందుకు సిద్ధం అవుతోంది. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లైనా సరే వారిపై అనర్హత వేటు పడే విధంగా ప్రయత్నాలు చేస్తోంది.
దీనికోసం లీగల్ టీం తో కసరత్తు చేస్తోంది.గతంలో పార్టీ ఫిరాయింపుల కు పాల్పడిన వారి విషయంలో న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను అనుసరించి పార్టీ మారే వారిపై పిటిషన్ వేయాలని బీ ఆర్ ఎస్ నిర్ణయించుకుంది.
దీని కారణంగా పార్టీ మారే ఆలోచనలో ఉన్నవారు ఫిరాయింపులకు పాల్పడకుండా ఉంటారని అంచనా వేస్తోంది.

కాంగ్రెస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ కు ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిపోతున్నారు.ఊహించని విధంగా రోజుకో ఎమ్మెల్యే అన్నట్లుగా పార్టీ మారిపోతుండడంతో , రానున్న రోజుల్లో వలసలకు బ్రేక్ వేసే విధంగా కట్టడి చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది .పార్టీని వీడిన ప్రతి ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ వేసే విధంగా లీగల్ టీం సిద్ధం అవుతోంది. ముందుగా ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ తరఫున గెలిచిన దానం నాగేందర్( Danam Nagender ) కాంగ్రెస్ లో చేరడం తో ఆయనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు.అలాగే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు , స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరిపోవడం తో వారి పైన పార్టీ కోర్టుకు వెళ్ళింది.
బీఆర్ఎస్ బీఫామ్ పై గెలిచి కాంగ్రెస్ లో చేరారని , వారిపై అనర్హత వేటువేయాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది.ఈనెల 27న హైకోర్టులో దానం నాగేందర్ అనర్హత అంశంపై విచారణ జరగనుంది .కోర్టు తీర్పును బట్టి సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది.

నాగేందర్ తో పాటు పార్టీ మారిన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి( Pocharam Srinivas Reddy ) , జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, ఇంకా ఎవరైనా పార్టీ మారితే వారి పైన కోర్టుకు వెళ్లేందుకు సోమా భరత్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ లీగల్ టీం కెసిఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది.హిమాచల్ ప్రదేశ్ , కర్ణాటక రాష్ట్రంలో ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు.దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసింది.
దీంతో కోర్టు తీర్పును పూర్తిగా పరిశీలించి కేసు వేసిన దగ్గర నుంచి అనర్హత వేటుపడే వరకు జరిగిన పరిణామాలు అన్నిటిని పరిశీలించి భవిష్యత్తులో ఎవరు పార్టీ మారకుండా టిఆర్ఎస్ లీగల్ గా ముందుకు వెళ్లేందుకు వ్యూహం రచిస్తోంది.