టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఏడీ ( Kalki 2898 AD )మరికొన్ని గంటల్లో రికార్డ్ స్థాయి స్క్రీన్లలో విడుదల కానుండగా ఈ సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ సైతం అదిరిపోతున్నాయి.ప్రముఖ థియేటర్లలో రిలీజ్ కు ఒకరోజు ముందే హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.
కల్కి సినిమా హిందీ ఫస్ట్ డే కలెక్షన్లు 30 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

బాలీవుడ్ స్టార్ హీరోలకు సైతం ఈ స్థాయిలో బుకింగ్స్ సాధ్యం కావడం లేదు.బుకింగ్స్ తోనే ప్రభాస్( Prabhas ) చుక్కలు చూపిస్తున్నాడుగా అనే కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.షారుఖ్ ఖాన్ సినిమాలు మాత్రమే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ రేంజ్ లో కలెక్షన్లు సాధిస్తున్నాయని సమాచారం అందుతోంది.
కల్కి 2898 ఏడీ ఇంటర్వెల్, క్లైమాక్స్ సన్నివేశాలు మాత్రం ఊహలకు అస్సలు అందవని తెలుస్తోంది.

కల్కి 2898 ఏడీ సినిమా ఇతర భాషల్లో సైతం రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తుండగా ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.తమిళనాడు రాష్ట్రంలో మాత్రం కల్కి బుకింగ్స్ ఆశాజనకంగా లేవు.కమల్ హాసన్ ఈ సినిమాలో విలన్ రోల్ లో నటిస్తున్నా తమిళనాడు(Tamil Nadu ) రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఉండటంతో ఆశ్చర్యపోవడం ప్రభాస్ అభిమానుల వంతవుతోంది.
కల్కి 2898 ఏడీ ఫ్యాన్స్ అంచనాలను మించి ఉండబోతుందని సమాచారం అందుతోంది.కల్కి సినిమాలో చాలా పాత్రలకు సంబంధించి స్పష్టత రావాలంటే సినిమా రిలీజయ్యే వరకు ఆగాల్సిందే.
కల్కి 2898 ఏడీ ప్రభాస్ కెరీర్ లో మెమొరబుల్ సినిమాగా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.కల్కి 2898 ఏడీ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు 200 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండనున్నాయని అభిమానులు ఫీలవుతుండటం గమనార్హం.
కల్కి సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ కు ఏ స్థాయిలో నచ్చుతుందో చూడాలి .