మనలో చాలా మందికి భోజనం చేసేటప్పుడు టీవీ ముందర కూర్చొని తినడం అలవాటుగా ఉంటుంది.కానీ ఇలా తినడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
టీవీ చూస్తూ తినడం ద్వారా మన దృష్టి మొత్తం టీవీ పై ఉండటంతో మనం ఎంత పరిమాణంలో తింటున్నామనే విషయాన్ని మన మెదడు కూడా గ్రహించలేకపోతుంది.కనుక అధిక మొత్తంలో ఆహారాన్ని తీసుకుంటాము.
ఇలా అధిక మొత్తంలో ఆహారం తీసుకోవడం ద్వారా అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు.
టీవీ చూస్తూ భోజనం లేదా స్నాక్స్ తింటున్నప్పుడు పరిమితికి మించి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి.
అంతేకాకుండా ఉన్నఫలంగా మన శరీరం బరువు కూడా పెరుగుతుంది.కాబట్టి టీవీ చూస్తున్నప్పుడు భోజనం చేయకుండా జాగ్రత్త పడాలి.మనం టీవీ చూస్తూ భోజనం చేస్తున్నప్పుడు మన దృష్టి మొత్తం టీవీ పై మల్లుతుంది దాంతో మన మెదడు కూడా టీవీతో నిమగ్నమై మనకు భోజనం ఇక చాలు అనే సంకేతాలను ఇవ్వడం మర్చిపోతుంది.అందువల్ల మనం టీవీ చూస్తున్నప్పుడు ఎక్కువగా ఆహారాన్ని తీసుకుంటాము.
దీని ద్వారా శరీర బరువు పెరిగి ఊబకాయం, గుండె సంబంధిత వ్యాధులు, గొంతులో మంట వంటి అనేక రకాల సమస్యలకు దారి తీస్తుంది.
మనకు ఆకలిగా అనిపిస్తే మనమే భోజనం దగ్గరకు వెళ్లి, ప్రశాంతంగా భోజనం చేసి రావాలి.
మనం తింటున్న ఆహారం పై దృష్టి పెట్టడం ద్వారా మనకు ఎంత ఆహారం అవసరం అవుతుందో అంతటికి మాత్రమే మెదడు సంకేతాలను పంపిస్తుంది.ఇలా పరిమిత సంఖ్యలో ఆహారాన్ని తీసుకోగలుగుతాము.
ఒక్కసారిగా ఈ అలవాటును మార్చుకోవాలంటే కష్టతరమవుతుంది కాబట్టి మెల్లమెల్లగా ఈ అలవాటును మానుకోవడం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరమని నిపుణులు తెలియజేస్తున్నారు.అంతే కాకుండా టీవీ చూస్తున్నప్పుడు భోజనం కాకుండా, ఇతర పనులపై దృష్టి పెట్టడంతో ఈ అలవాటును క్రమంగా మానుకోవచ్చు.