సబ్జా గింజలు.వీటి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ప్రస్తుత వేసవి కాలంలో శరీరాన్ని కూల్ చేసుకునేందుకు.నీరసం, అలసట, తలనొప్పి వంటి సమస్యలను వదిలించుకునేందుకు.బాడీని హైడ్రేటెడ్‌గా ఉంచుకునేందుకు సబ్జా గింజలను రెగ్యులర్‌గా తీసుకుంటారు.అయితే ఆరోగ్యానికే కాదు కేశ సంరక్షణకు సైతం అద్భుతంగా ఇవి సహాయపడతాయి.
ముఖ్యంగా సబ్జా గింజలతో ఇప్పుడు చెప్పబోయే విధంగా హెయిర్ ప్యాక్ వేసుకుంటే పొడవాటి కురులను తమ సొంతం చేసుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం సబ్జా గింజలతో హెయిర్ ప్యాక్ ఎలా వేసుకోవాలో చూసేయండి.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ సబ్జా గింజలు వేసి వాటర్ పోసి నాన బెట్టుకోవాలి.అలాగే ఒక ఉల్లిపాయను తీసుకుని పీల్ తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
మరోవైపు ఒక కప్పు కొబ్బరి ముక్కలను తీసుకుని మెత్తగా పేస్ట్ చేసి పాలను మాత్రం సపరేట్ చేసుకోవాలి.

ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో నాన బెట్టుకున్న సబ్జా గింజలు, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు మరియు కొబ్బరి పాలు వేసి గ్రౌండ్ చేసుకోవాలి.ఆ తర్వా త ఈ మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ కొకొనట్ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ పెట్టేసుకోవాలి.
గంట అనంతరం మైల్డ్ షాంపూను యూజ్ చేసి గోరు వెచ్చని నీటితో హెడ్ బాత్ చేయాలి.ఇలా వారంలో ఒకసారి చేస్తే గనుక బలహీనమైన కురులు బలంగా మారి ఊడటం తగ్గుతుంది.
అదే సమయంలో జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.చుండ్రు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
మరియు జుట్టు డ్రై అవ్వకుండా కూడా ఉంటుంది.







