గత ఎన్నికల్లో టీడీపీ చిత్తుగా ఓడిపోవడంతో పాటు పార్టీ చరిత్రలోనే లేనంత దీనస్థితిలో ఉండడంతో పార్టీకి భవిష్యత్తు ఉంటుందన్న నమ్మకాలు ఎవ్వరికి ఉండడం లేదు.ఈ క్రమంలోనే నలుగురు ఎమ్మెల్యేలు సైతం జగన్ చెంతకు చేరిపోయారు.
ఈ క్రమంలోనే పార్టీలో ఉన్న నేతల మధ్య కూడా సరైన వాతావరణం లేదు.పార్టీకి కంచుకోట అయిన కృష్ణా జిల్లాలో పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది.
ఇప్పటికే ఇక్కడ గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో గన్నవరం ఎమ్మెల్యే వంశీ పార్టీకి దూరం అయ్యారు.మిగిలిన వారు కూడా పార్టీ సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంటే బయటకు వచ్చేందుకు ఇష్టపడడం లేదు.
ఇక జిల్లా పార్టీలో పలువురు నేతల మధ్య విబేధాలు తీవ్రంగా ఉన్నాయని.ఓ మాజీ మంత్రి తీరుతో పలువురు నేతలు తాము ఇబ్బందులు పడుతున్నామన్న విషయం పార్టీ అధిష్టానం చెవిలో వేసినట్టు ప్రచారం జరుగుతోంది.
ఆయన పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఇష్టారాజ్యంగా వ్యవహరించారు.ఇప్పుడు కూడా ఆయన ఎన్నికల్లో ఓడిపోయినా అంతా తాను చెప్పిందే వేదం అన్న రీతిలో వ్యవహరిస్తున్నారని సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర విమర్శలు ఉన్నాయి.
ఆ మాజీ మంత్రి ప్రతి నియోజకవర్గంలో పుల్లలు పెట్టడంతో పార్టీ నేతలు కూడా సహించలేకపోతున్నారు.ఇంత తీవ్ర వ్యతిరేక గాలులను తట్టుకుని కూడా గెలిచిన ఎంపీ కేశినేని నాని లాంటి వాళ్లు సైతం ఆయన తీరుపై గుర్రుగా ఉన్నారు.అయితే జిల్లాకే చెందిన కొందరు పార్టీ నేతలు ఈ విషయాన్ని బాలకృష్ణకు చెప్పడంతో ఆయన స్వయంగా రంగంలోకి దిగారని తెలుస్తోంది.ముందు ఎవరిది తప్పు ? అన్న కోణంలో ఆయన తన సన్నిహితుల ద్వారా సమాచారం తెప్పించుకున్నారట.
అటు మాజీ మంత్రితో పాటు ఇటు మిగిలిన నేతలు అందరూ కూడా పార్టీకి కీలక నేతలు కావడంతో ఎవ్వరూ నొచ్చుకోకుండా సర్దుకు పోవాలని బాలయ్య చెపుతున్నట్టు సమాచారం.అయితే ఇదే విషయంపై బాలయ్య చంద్రబాబుతో చర్చించి అక్కడ గొడవను సామరస్య పూర్వకంగా పరిష్కరించేలా ప్లాన్ చేస్తున్నారట.
ఏదేమైనా బాలయ్ జోక్యంతో కృష్ణా టీడీపీ పంచాయితీ ఎలా ముగుస్తుందో ? అన్న ఆసక్తి అయితే ఉంది.