Golden Poison Frog : మనుషులను చంపే కప్పలు...మీరెప్పుడైనా చూశారా..?

మనిషిని చంపే వాటిల్లో పాములు, పులులు లాంటివే ఉంటాయి అనుకోవడానికి లేదు.చీమలు కూడా చంపగలవు.

 Shocking Facts About Golden Poison Frog Kills 10members At A Time,golden Poison-TeluguStop.com

చీమలకు భయపడి ఒక ఊరు ఊరే ఖాళీ అయింది.మిడతలు భయపడి వలసలు పోయిన ఘటనలు ఉన్నాయి.

కప్పలు అంత డేంజరెస్‌ కావనుకుంటారేమో.కప్పల్లో కూడా విషపూరితమైన కప్పలు ఉన్నాయి.

చూసేందుకు అందంగా ఉంటాయి కానీ.ఒళ్ళంతా విషమే.

ఈ కప్పలను గోల్డెన్ పాయిజన్ కప్పలు అంటారు.అవి సాధారణంగా రెండు అంగుళాలు లేదా కొంచెం పెద్దవి లేదా చిన్నవిగా ఉంటాయి.

కానీ ఈ కప్పలు పది మందిని చంపేంత విషం ఇందులో ఉండటం గమనార్హం.శతాబ్దాలుగా కొలంబియాలోని వేటగాళ్ళు తమ ఎరను పట్టుకోవడానికి ఈ రకమైన కప్ప విషాన్ని ఉపయోగిస్తారట.
కప్పలు ఎందుకు విషపూరితమైనవి అనే దానిపై సమాచారం లేదు.అయినప్పటికీ, వాటి విషం ప్రధానంగా మొక్కలు, విషపూరిత కీటకాల నుంచి వస్తుందని నమ్ముతారు.అయితే ఇతర ప్రదేశాలలో ఉన్న కప్పలకు ఎలాంటి విషం లేకపోయినా? ఈ కప్పల్లో విషయం ఉండటం భయాందోళన కలిగించే అంశం.ఈ కప్పలను తాకడం కూడా మరణానికి దారితీస్తుందట.

వైద్య పరిశోధనలో పాల్గొన్న వ్యక్తులు ఈ రకమైన కప్పలను వైద్య రంగంలో ఉపయోగించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు.ఈ కప్పలు ఔషధాలను తయారు చేయడానికి ఉపయోగించవచ్చని వైద్యులు భావిస్తున్నారు.

దీని ద్వారా శక్తివంతమైన పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్‌లను తయారు చేసేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.

ఈ మచ్చల కప్పలో 100 కంటే ఎక్కువ జాతులు ఉన్నాయి.వాటి సగటు పొడవు ఒక అంగుళం కంటే ఎక్కువ ఉంటుంది.చాలా కప్ప జాతులు కొలంబియాలోని పసిఫిక్ తీరంలో రెయిన్‌ఫారెస్ట్‌లోని చిన్న పాచ్‌లో నివసిస్తున్నాయి.

ఏదైనా ప్రమాదాన్ని గుర్తించినప్పుడు, చర్మం నుంచి విషం విడుదల అవుతుంది.ఆ విషం నేరుగా మానవ చర్మంపై పడినప్పుడు మనిషి చనిపోయే ప్రమాదం ఉంది.

ఈ కప్పల విషయం మనుషులపై పడినప్పుడు పల్స్‌ రేటు పడిపోయే చనిపోయే ప్రమాదం ఉంది.ఈ కప్పలు తక్కువ ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో జీవించగలవు.

ఈ కప్ప రంగు పసుపు, నారింజ లేదా లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది.వివిధ ప్రదేశాలను బట్టి వాటి రంగులు కూడా భిన్నంగా ఉంటాయి.

ఈ కప్పలు వేటాడేవారిపై విష ప్రయోగం చేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.ఇవి ప్రధానంగా ఈగలు, చీమలు, చెదపురుగులను తింటాయి.

బంగారు పాయిజన్ కప్పల శరీరాలు కూడా విషపూరితమైనవి.

Shocking Facts about Golden Poison Frog

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube