టాలీవుడ్ నుండి బాలీవుడ్( Bollywood ) వరకు ఇప్పుడు అందరి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం , యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆదిపురుష్’.ఈ చిత్రం ఈ నెల 16 వ తారీఖున అన్నీ ప్రాంతీయ బాషలలో ఘనంగా విడుదల చెయ్యబోతున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలు , ట్రైలర్ అభిమానుల్లో అంచనాలను అమాంతం పెంచేసాయి.అప్పటికే ‘జై శ్రీ రామ్’( Jai Shri Ram ) పాట ఇండియా మొత్తం ఒక రేంజ్ లో వ్యాప్తి చెందింది.
ఎక్కడ చూసిన ఈ పాట వినిపిస్తూనే ఉంది.రీసెంట్ గా విడుదల చేసిన ‘రామ్ సీత రామ్’( Ram Sita Ram ) పాట కూడా పెద్ద హిట్ అయ్యింది.
ఇలా రెండు పాటలు మంచి రీచ్ ని సంపాదించడం తో ఈ చిత్రం పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.ఇది ఇలా ఉండగా ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ తెలుగు థియేట్రికల్ రైట్స్ ని సుమారుగా 180 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే.
` ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా భారీ ఖర్చు తో ఈ నెల 6 వ తారీఖున జరిపించబోతున్నారు.ఇది కాసేపు పక్కన పెడితే ఈ పీపుల్స్ మీడియా ఫ్యాక్టర్ సంస్థ పవన్ కళ్యాణ్ తో ‘బ్రో ది అవతార్’( Brow the Avatar ) అనే చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.ఈమధ్యనే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్స్ ని కూడా విడుదల చేసారు.ఈ సినిమా వచ్చే నెల 28 వ తారీఖున గ్రాండ్ గా విడుదల కాబోతుంది.
సినిమా విడుదలకు సరిగ్గా 50 రోజులు కూడా లేవు.ఈ పాటికే టీజర్ వచ్చి ఉండాలి.
కానీ అది జరగలేదు, ఫ్యాన్స్ దీనిపై తీవ్రమైన ఆగ్రహం ని వ్యక్తం చేస్తున్నారు.టీజర్ మరియు లిరికల్ వీడియో సాంగ్స్ ని వదలాల్సిన సమయం లో ఇంకా పోస్టర్స్ వదులుతూ కాలాన్ని వృథా చేస్తున్నారని , సినిమా మీద అసలే అభిమానుల్లో అంచనాలు లేవు, ఇంత వీక్ ప్రొమోషన్స్ చేస్తే ఓపెనింగ్స్ కూడా రావు అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే ‘బ్రో’ ( Bro )మూవీ టీం నుండి ఒక సెన్సేషనల్ అప్డేట్ అతి త్వరలోనే రానుంది అట.ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని వచ్చే వారం లో విడుదల చేసి, అదే టీజర్ ని ‘ఆదిపురుష్’ మూవీ తో జతచేసి థియేటర్స్ లో కూడా విడుదల చేయబోతున్నారట.ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యినట్టు సమాచారం.ఇదే కనుక జరిగితే ఆదిపురుష్ మూవీ కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుండి కూడా ఒక రేంజ్ లో సపోర్టు లభిస్తుంది.
ప్రభాస్ అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా కేవలం పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టీజర్ ని వెండితెర మీద చూసేందుకు థియేటర్స్ కి వెళ్లే పిచ్చి అభిమానుల సంఖ్య లక్షల్లోనే ఉంటుంది.దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే తెలియచెయ్యనుండి మూవీ టీం.