Vijay Deverakonda Samantha Khushi: 'ఖుషి' నాన్ థియేట్రికల్ అన్ని కోట్లా.. లైగర్ ఎఫెక్ట్ అస్సలు పడలేదుగా!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సౌత్ స్టార్ హీరోయిన్ సమంత కలిసి జంటగా నటిస్తున్న సినిమా ఖుషి. ప్రేమ కథలను తెరకెక్కించే డైరెక్టర్ శివ నిర్వాణ ఈ సినిమాను మరో అందమైన ప్రేమ కథగా మలుస్తున్నాడు.

 Non Theatrical Rights Of Vijay Deverakonda Samantha Khushi Details, Samantha, Vi-TeluguStop.com

కాశ్మీర్ నేపథ్యంలో సాగే ఈ ప్రేమ కథ కోసం ఫ్యాన్స్ అంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.

గత కొన్ని నెలల క్రితం ప్రకటించి షూటింగ్ కూడా వెంటనే స్టార్ట్ చేసారు.కాశ్మీర్ లో అందమైన లొకేషన్స్ తో పాటు వైజాగ్ బీచ్, హైదరాబాద్ లో కూడా ఈ సినిమా షూటింగ్ జరిగింది.

విజయ్ దేవరకొండ, సమంత జోడీగా నటిస్తున్నారు అంటే ఫ్యాన్స్ కు ఈ సినిమాపై బాగా ఆసక్తి కలిగింది.ఈ సినిమాలో వీరిద్దరి జోడీ ఫ్రెష్ గా అనిపిస్తుందో అనడంలో ఎలాంటి సందేహం లేదు.

లైగర్ సినిమా ప్రొమోషన్స్ కారణంగా షూటింగ్ కొంత కాలం నిలిపి వేశారు.కానీ లైగర్ డిజాస్టర్ అవ్వడంతో రౌడీ కొన్నాళ్ల పాటు సైలెంట్ అయ్యాడు.

ఇక ఇప్పుడు మళ్ళీ సెట్స్ లోకి అడుగు పెట్టేందుకు రెడీ అయినా సామ్ కారణంగా ఈ షూట్ ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ గురించి ఒక వార్త నెట్టింట వైరల్ అయ్యింది.

Telugu Kushi, Liger, Mytri Makers, Samantha, Shiva Nirvana-Movie

ఈ సినిమాకు అన్ని భాషల్లో కలిపి నాన్ థియేట్రికల్ రైట్స్ 90 కోట్ల రూపాయలకి పైగానే అమ్ముడు పోయినట్టు తెలుస్తుంది.ఈ మొత్తం విని అంతా ఆశ్చర్య పోతున్నారు.లైగర్ దారుణంగా ప్లాప్ అయినా ఇంత మొత్తం థియేట్రికల్ రైట్స్ కు పెట్టడం అంటే మాములు విషయం కాదు.దీంతో లైగర్ ప్రభావం ఏ మాత్రం విజయ్ నెక్స్ట్ సినిమాలపై పడలేను అని తెలుస్తుంది.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు హీషమ్ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమా మీదనే ఇటు విజయ్, సమంత, అటు శివ నిర్వాణ ఆశలు పెట్టుకున్నారు.

మరి ఈ లవ్ స్టోరీ ఈ జోడీకి ఎలాంటి హిట్ అందిస్తుందో వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube