హంత‌కుడికి ముద్దులు పెట్టిన మ‌హిళా జడ్జి.. వీడియో వైర‌ల్‌

న్యాయ‌మూర్తి అంటే అంద‌రికీ న్యాయం చెప్పే గొప్ప స్థానం.న్యాయ‌మూర్తి అంటేనే గౌర‌వం, మ‌ర్యాద‌కు పెట్టింది పేరు.

 The Female Judge Who Kissed The Killer In Argentina Details, Judge Kissed Killer-TeluguStop.com

ప్ర‌తి విష‌యంలో కూడా వారు ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తుంటారు.అందుకే వారిని అంత గొప్ప‌గా కీర్తిస్తుంటారు.

వారి వ‌ద్ద‌కు వెళ్తే ఎవ‌రికైనా న్యాయం జ‌రుగుతుంద‌ని న‌మ్ముతారు ప్ర‌జ‌లు.అందుకే వారికి అంత‌గా గౌర‌వం ఇస్తుంటారు.

కాగా ఓ మ‌హిళా న్యాయ‌మూర్తి చేసిన ప‌ని ఇప్పుడు సంచంనంగా మారింది.ఆమె ఓ హంత‌కుడికి ముద్దులు పెట్టడం ఇప్పుడు ప్ర‌పంచాన్ని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.

కాగా ఈ ఘ‌ట‌న అర్జెంటీనాలో జ‌రిగింది.

పైగా ఆ హంత‌కుడు ఇప్పుడు జైలులో శిక్ష అనుభ‌విస్తున్నాడు.

అయినా స‌రే అత‌ని వ‌ద్ద‌కు వెళ్లి జైలులోనే ఆ మ‌హిళా జ‌డ్జి క‌లుసుకున్నారు.ఇలా ఆమె అత‌న్ని క‌లుసుకున్న వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

అర్జెంటీనాలో చుబూట్ ప్రావిన్స్ మారిల్ సురెజ్ మ‌హిళా న్యాయ‌మూర్తిగా కొన‌సాగుతున్నారు.ఆమె ఇంత‌కు ముందు ఎన్నో ఘ‌ట‌న‌ల్లో పురుష‌ల‌తో పాటు మ‌హిళ‌ల‌కు స‌మానంగా హ‌క్కులు ఉండాల‌ని తీర్పులు ఇచ్చింది.

కాగా ఆమె వ‌ద్దకు ఓ హ‌త్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్య‌క్తి క్రిస్టియన్ బాయి బుస్టాస్ హాజ‌ర‌య్యాడు.

అత‌ను లీండ్రో రాబర్ట్స్ అనే పోలీస్ ఆఫీస‌ర్‌ను మ‌ర్డ‌ర్ చేశాడు.కాగా అత‌ను ఆ కేసులో భాగంగా మారిల్ ముదుకు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యాడు.ఇక అత‌నికి జీవిత ఖైదు కూడా విధించారు.

అయితే ఆ హంత‌కుడితో ఆమె ఎప్పుడు ల‌వ్ లో ప‌డిందో తెలీదు గానీ.అత‌డిని క‌లుసుకునేందుకు నిత్యం జైలుకు వెళ్లేది.

ఇక జైలులోనే అత‌నికి ముద్దులు కూడా ఇచ్చేసింది.జైలులోనే ఉన్న సీసీ కెమేరాలో ఇదంతా న‌మోదు అయింది.

ఇంకేముంది ఆ వీడియో కాస్త నెట్టింట్లో తెగ వైర‌ల్ గా మారిది.ఇది చూసిన వారంతా కూడా న్యాయ‌మూర్తి అయి ఉండి ఇలా చేయ‌డం ఏంట‌ని ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube