టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) గురించి మనందరికీ తెలిసిందే.సమంత ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉండు తన ఆరోగ్యం పై పూర్తిగా శ్రద్ధ వహిస్తోంది.
ఈ మధ్యకాలంలో సమంతను చూస్తే ఆమెలో చాలా మార్పులు వచ్చినట్టు గమనించవచ్చు.ఆ సంగతి పక్కన పెడితే సమంత సినిమాలలో నటించకపోయినప్పటికీ ఆమెకు సంబంధించిన వార్తలు మాత్రం సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంటాయి.
అందులో భాగంగానే గత కొద్ది రోజులుగా సమంత డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ( director Raj Nidimoru )ప్రేమలో ఉందని,త్వరలో రెండో పెళ్లి చేసుకునే అవకాశం ఉంది కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

ఇటీవల పికిల్ బాల్ టోర్నమెంట్( Pickleball Tournament ) సందర్భంగా రాజ్ చేతిని పట్టుకొని కనిపించింది సమంత.దీంతో వీరి ప్రేమ వార్తలకు బలం చేకూరింది.ఇక ఇప్పుడు వాలెంటైన్స్ డే సందర్భంగా సమంత చేసిన ఒక పోస్ట్ నిజంగానే ఏదో ఉందని హింట్ ఇచ్చేలా ఉంది.
తాజాగా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా.ఇంస్టాగ్రామ్ లో “Just a TEASE.
Or maybe more”అంటూ కొన్ని ఫొటోలను షేర్ చేసింది సమంత.వాటిలో మూడు ఫొటోలు ప్రేమ, పార్టనర్ గురించి హింట్ ఇస్తున్నట్టుగా ఉన్నాయి.
ఒక పిక్ లో ఆల్ ది లిటిల్ థింగ్స్( All the Little Things ) అంటూ కొన్ని పాయింట్స్ ని షేర్ చేసింది.మరో పిక్ లో పార్టనర్ కి చీర్స్ కొడుతున్నట్టుగా ఉంది.

ఇంకో పిక్ లో ఒక క్లాత్ మీద లవ్ సింబల్ స్ట్రిచ్ చేసి ఉంది.మొత్తానికి సమంత తాజా పోస్ట్ ని చూస్తే ప్రేమ, పెళ్లి వార్తలు నిజమే అనే అభిప్రాయం కలుగుతోంది.దీంతో మరోసారి సమంత ప్రేమ గురించి పెళ్లి వ్యవహారాల గురించి వార్తలు వైరల్ గా మారాయి.ఈ వార్తలపై సమంత ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.ఇకపోతే సమంత చివరగా ఖుషి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా విడుదల అయ్యి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.