పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ( Prabhas ) తాజాగా సలార్ ( Salaar ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ సినిమా అన్ని ప్రాంతాలలోనూ భారీ స్థాయిలో కలెక్షన్లను రాబడుతూ ప్రభాస్ కు మరొక హిట్ సినిమాను అందించింది.ఇకపోతే ఈ సినిమా గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే.
ఈ సినిమాలో ప్రభాస్ కటౌట్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.చాలా రోజుల తర్వాత ప్రభాస్ ను ఇలా చూడటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.ఇకపోతే ఈ సినిమాలో ప్రభాస్ చెప్పినటువంటి డైలాగ్స్ ( Dailogue ) గురించి కూడా ఒక వార్త వైరల్ గా మారింది.ఈ సినిమాలో ప్రభాస్ కి పెద్దగా డైలాగ్స్ లేవనే చెప్పాలి.
ప్రభాస్ ఈ సినిమాలో మొదటి హాఫ్ మొత్తం చూసుకుంటే ఎక్కడా కూడా ఈయనకు పవర్ ఫుల్ డైలాగ్స్ లేవు.
ఇక సెకండ్ హాఫ్ లో కూడా కొన్ని డైలాగ్స్ ఉన్నప్పటికీ అవి కూడా పవర్ ఫుల్ డైలాగ్స్ కాదని చాలా సింపుల్ డైలాగ్స్ అని తెలుస్తుంది.పగిలిందా, సారీ, రెండు నిమిషాల్లో దొరలా రెడీ చేస్తా, ప్లీజ్ ఐ కైండ్లీ రిక్వెస్ట్, వాళ్లను గర్ల్ ఫ్రెండ్స్ అంటారు.ఇలా చిన్న డైలాగ్స్ తోనే సరిపెట్టారు.
ఇలా ప్రభాస్ ఈ చిన్న డైలాగ్స్ తో కలిపి సుమారు 38 డైలాగ్స్ మాత్రమే చెప్పారంటూ ఈ సినిమాలో ప్రభాస్ చెప్పినటువంటి డైలాగ్స్ గురించి ఒక వార్త వైరల్ గా మారింది.అయితే ఇప్పటివరకు ప్రభాస్ నటించిన సినిమాలలో అత్యంత తక్కువ డైలాగ్స్ ఉన్నటువంటి సినిమా సలార్ అని చెప్పాలి.
అయితే ప్రభాస్ కటౌట్ కి డైలాగ్స్ అవసరం లేదని డైలాగ్స్ లేకపోయినా ప్రభాస్ అదరగోట్టారు అంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.