బుల్లితెరపై ప్రసారమవుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నటువంటి కామెడీ షో లలో జబర్దస్త్ ( Jabardasth ) కార్యక్రమం ఒకటి.ఈ కార్యక్రమం గత దశాబ్ద కాలం పైగా ప్రసారమవుతు పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించుకుంది.
ఇక ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయం అవ్వడమే కాకుండా ప్రస్తుతం వీరంతా కూడా సినిమాల పరంగా వెండితెరపై ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇక ఈ కార్యక్రమానికి మొదట్లో అనసూయ ( Anasuya ) యాంకర్ గా వ్యవహరించేది.
ఈమెకు కూడా సినిమా అవకాశాలు రావడంతో అనసూయ కూడా ఈ కార్యక్రమం నుంచి తప్పకున్నారు. అనసూయ జబర్దస్త్ కార్యక్రమం నుంచి వెళ్లిపోవడంతో ఈ కార్యక్రమానికి కన్నడ బుల్లితెర నటి సౌమ్యరావు ( Sowmya Rao ) యాంకర్ గా కొనసాగారు.ఈమె కూడా తన మాట తీరుతో పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నారు.అయితే సౌమ్యరావు ఉన్నఫలంగా ఈ కార్యక్రమం నుంచి తప్పకోవడంతో ఈమె ఎందుకు ఈ కార్యక్రమం నుంచి వెళ్లారు.
ఏంటి అనే విషయాలు మాత్రం ఎవరికీ తెలియదు.ఇలా సౌమ్యరావు వెళ్లిపోవడంతో తన స్థానంలో బిగ్ బాస్ కార్యక్రమాల ద్వారా గుర్తింపు సంపాదించుకున్నటువంటి సిరి హనుమంతు( Siri Hanumanth ) యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.
ఇక సౌమ్య రావు ఈ కార్యక్రమం నుంచి ఎందుకు తప్పుకున్నారు అనే విషయాన్ని నేరుగా అభిమానులు ఆమెనే ప్రశ్నించారు.దీంతో ఆమె టైం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెబుతాను అంటూ సమాధానం ఇవ్వడంతో ఈమె జబర్దస్త్ ను వీడటం వెనుక ఏదో జరిగింది అంటూ కామెంట్ చేశారు అయితే ప్రస్తుతం ఈ కార్యక్రమానికి తిరిగి సౌమ్యరావు రావాలి అంటూ అభిమానులు డిమాండ్ చేయడమే కాకుండా మీరు ఈ కార్యక్రమానికి రండి అంటూ ఆమెను ప్రశ్నిస్తున్నారు దీంతో ఆమె టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తాను అంటూ కామెంట్ చేశారు.ఇలా ఈమె సమాధానం చూస్తుంటే ఈ కార్యక్రమం నుంచి ఉద్దేశపూర్వకంగానే సౌమ్యరావును బయటకు పంపించారా అన్న సందేహాలు కలుగుతున్నాయి.