ఆరోజు రాశి నన్ను కొట్టడానికి అదే కారణం.. శ్రీకాంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు శ్రీకాంత్ ( Sreekanth ) ఒకరు.ఈయన ఎన్నో అద్భుతమైనటువంటి కుటుంబ కథా చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతోమంది ఫ్యామిలీ ఆడియన్స్ ని సొంతం చేసుకున్నారు.

 Sreekanth Reveals About Why Rashi Slap Him Details Here, Sreekanth, Rashi, Affa-TeluguStop.com

ఇక ఇప్పటికీ కూడా శ్రీకాంత్ వరుస సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు.యంగ్ హీరోలకు బాబాయ్, అన్నయ్య పాత్రలలో శ్రీకాంత్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం శ్రీకాంత్ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

Telugu Affairs, Bollywood, Rashi, Sreekanth-Movie

ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి శ్రీకాంత్ తన కెరియర్ గురించి అలాగే వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు.ముఖ్యంగా గత కొద్ది రోజుల క్రితం ఒక సినిమా వేడుకలో హీరో శ్రీకాంత్ తో పాటు హీరోయిన్ రాశి ( Rashi ) కూడా పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే.వీరిద్దరిది సూపర్ హిట్ జోడి .వీరిద్దరూ కలిసి ఎన్నో సినిమాలలో నటించారన్న విషయం మనకు తెలుసు.ఇక ఈ వేడుకలో రాశి వేదికపై ఉండగా పక్కనే ఉన్నటువంటి శ్రీకాంత్ ని కొట్టిన సంగతి తెలిసిందే ఇలా శ్రీకాంత్ ను రాశి కొట్టడంతో అప్పట్లో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది.

Telugu Affairs, Bollywood, Rashi, Sreekanth-Movie

తాజాగా రాశి ఆరోజు తనని ఎందుకు కొట్టిందనే విషయాన్ని శ్రీకాంత్ తెలిపారు.ఆరోజు సినిమా వేడుకలో పాల్గొన్నామని,ఆ సినిమా హీరోయిన్ రాశి వద్దకు వచ్చి తనని అమ్మ అని పిలిచింది అంటూ శ్రీకాంత్ తెలిపారు.హీరోయిన్ అమ్మ అని పిలవడంతో నేను కూడా రాశిని ఆటపట్టించడానికి సరదాగా అమ్మ అని పిలిచాను దాంతో ఆమె నన్ను కొట్టిందని తెలిపారు.ఇక హీరోయిన్స్ తో ఎఫైర్స్ ఉన్నాయా అంటూ ఈయనకు ప్రశ్న ఎదురవగా నవ్వుతూ సమాధానం చెప్పారు.

ఎవరో రాసింది మీరు అడుగుతున్నారు మీకు ఏదైనా సమాధానం తెలిస్తే మీరే చెప్పండి అంటూ నవ్వారు.ఇక బాలీవుడ్ ( Bolly Wood ) ఇండస్ట్రీలో అవకాశాలు వస్తే తప్పకుండా నటిస్తాను అంటూ ఈ సందర్భంగా శ్రీకాంత్ కెరియర్ గురించి కూడా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube