తెలంగాణలో గ్రూప్ -4 నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది.ఈ మేరకు గ్రూప్ -4 నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

 Release Of Group-4 Notification In Telangana-TeluguStop.com

రాష్ట్రంలో వివిధ శాఖల్లో 9,168 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషసన్ జారీ చేసింది.ఈనెల 23 నుంచి జనవరి 12 వరకు అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది.

రెవెన్యూ శాఖలో 2,077, మున్సిపల్ శాఖలో 2,701 పోస్టులు, ఉన్నత విద్యాశాఖలో 742, పంచాయతీ శాఖలో 1245 పోస్టులు, వైద్యారోగ్య శాఖలో 338, బీసీ సంక్షేమ శాఖలో 307 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.అదేవిధంగా ఆర్థిక శాఖలో 255, ఎస్సీ సంక్షేమ శాఖలో 474 పోస్టులు, ట్రైబల్ వేల్ఫేర్ డిపార్ట్ మెంట్ లో 221, మైనార్టీ వెల్ఫేర్ లో 191 పోస్టులతో పాటు హోంశాఖలో 133 పోస్టులను భర్తీ చేయనున్నారు.

వీటికి 2023 ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube