తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తులకు ఉచిత దర్శనం.. ముఖ్యంగా ఎవరికంటే..!

తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం( TTD ) శుభవార్త చెప్పింది.కానీ నడకన తిరుమలకు వస్తున్న భక్తుల కష్టాలు త్వరలో తీరిపోయే అవకాశాలు ఉన్నాయి.

 Free Darshan For Devotees Who Go To Tirumala On Foot Especially Than Anyone Els-TeluguStop.com

కరోనా ఆంక్షలు కారణంగా నడక మార్గంలో వచ్చే భక్తులకు గతంలో దర్శనం టికెట్లను నిలిపివేత పై తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.త్వరలో శ్రీవారి మెట్ల మార్గం గుండా వచ్చే భక్తులకు ఫ్రీ దర్శనం టికెట్లు ఇవ్వనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి( Eo Dharma Reddy ) వెల్లడించారు.

గతంలో ఇదే విషయాన్ని ప్రకటించిన టిటిడి అధికారులు మరోసారి క్లారిటీని ఇచ్చారు.

Telugu Bakti, Devotional, Eo Dharma Reddy, Tirumala-Latest News - Telugu

శుక్రవారం రాజంలో పర్యటించిన ఆయన దివ్య దర్శనం టికెట్లపై వివరణ ఇచ్చారు.త్వరలోనే తిరుమల ( Tirumala )కొండ పైకి నడిచి వెళ్లే భక్తులకు ఉచిత దర్శనం టికెట్లు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.నడక దారిలో వచ్చే అందరికీ కాకుండా ఎలాంటి టికెట్లు లేకుండా కొండ పైకి వచ్చేవారికి మాత్రమే టికెట్లు ఇస్తామని వెల్లడించారు.

భక్తులకు ఉచిత దర్శనం కల్పిస్తామని తిరుమల దేవస్థానం( Tirumala Devasthanam ) ఈవో వెల్లడించారు.టీటీడీలో ప్రవేశపెట్టిన ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ విధానం ద్వారా భక్తులకు సేవలు సులభంగా అందుతున్నాయని కూడా ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

Telugu Bakti, Devotional, Eo Dharma Reddy, Tirumala-Latest News - Telugu

స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని హామీ కూడా ఇచ్చారు.ముఖ్యంగా చెప్పాలంటే ఈనెల 21వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తామని వెల్లడించారు.ఆరోజు ఉదయం 11 గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుతుందని తెలిపారు.ఈ సందర్భంగా అష్టదళపాదపద్మారాధన సేవను రద్దు చేస్తున్నామని వెల్లడించారు.దీంతోపాటు తిరుమలలో ఈనెల 30వ తేదీన శ్రీవారి దేవాలయంలో శ్రీరామనవమి ఘనంగా జరగనుంది.30వ తేదీన సాయంత్రం 6 గంటలకు శ్రీవారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే మార్చి నెల 31వ తేదీన శ్రీరామ పట్టాభిషేకం ఎంతో ఘనంగా నిర్వహిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube