తనపై వచ్చిన మీమ్స్ పై స్పందించిన బాలయ్య.. ఏమన్నారంటే?

నందమూరి బాలకృష్ణ, యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన సినిమా ‘అఖండ’.ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు డిసెంబర్ 2న వరల్డ్ వైజ్ గా విడుదల అయ్యి అఖండ విజయం సాధించింది.

 Balayya Reacting To The Memes That Came Over Him Details, Memes, Akhanda,akhanda-TeluguStop.com

ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు ఎంత హిట్ అయ్యాయో అంతకు మించి అన్నట్టు అఖండ విజయం కొనసాగుతూ ఉంది.

ఇక చాలా రోజుల తర్వాత వచ్చిన విజయాన్ని బాలయ్య మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నాడు.

ఇటు బోయపాటి కూడా వినయ విధేయ రామ సినిమాతో వచ్చిన ప్లాప్ ను పూర్తిగా తుడిచిపెట్టేట్టు అఖండ సినిమా తీసి మరోసారి తన హవా కొనసాగిస్తున్నాడు.ఇక అఖండ విజయంపై టాలీవుడ్ మొత్తం పాజిటివ్ గా స్పందిస్తుంది.

స్టార్ హీరోలు సైతం అఖండ టీమ్ అందరికి అభినందనలు చెప్పారు.

ఇక ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నప్పటికీ ఇంకా ఈ టీమ్ అంతా ప్రమోషన్స్ లో చురుకుగా పాల్గొంటున్నారు.

ఇక తాజాగా ఈ సినిమా టీమ్ బాలయ్య, బోయపాటి, ప్రగ్యా, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ పాల్గొన్న ఇంటర్వ్యూలో.బాలయ్యపై అఖండ విజయం సందర్భంగా వచ్చిన మీమ్స్ గురించి కూడా టాపిక్ వచ్చింది.

ఈ క్రమంలోనే థమన్ బాలయ్యపై వచ్చిన కొన్ని మీమ్స్ ను ఫోన్ లో చూసి చదివి వినిపించాడు.

Telugu Akhanda, Balakrishna, Balayya Memes, Boyapati, Memes, Pragya Jaiswal, Tha

కిందా మీద ఊపు – మా బాలయ్య బాబు తోపు

బెండకాయ దొండకాయ – బాలయ్య నా గుండెకాయ

అన్నంలో పెరుగులేదు – మా బాలయ్య బాబుకి తిరుగులేదు

రాముడు, భీముడు – మా బాలయ్య దేవుడు

Telugu Akhanda, Balakrishna, Balayya Memes, Boyapati, Memes, Pragya Jaiswal, Tha

ఇలాంటి మరికొన్ని ఫన్నీ మీమ్స్ ను ఈ ఇంటర్వ్యూ లో థమన్ చదివి వినిపించగా వాటిపై బాలయ్య స్పందించాడు.”నన్ను ఆరాధించే కొందరు అభిమానులు మంచి జీవితాన్ని కూడా గడపడం లేదు.జీవించడానికే కష్టపడుతూ ఉంటారు.

అయినా కూడా నా పట్ల ఇంతటి అభిమానం చూపించడం పట్ల నేను వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను.ఇది నాకు దేవుడిచ్చిన వరం అనే చెప్పాలి” అని బాలయ్య మాట్లాడారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube