వైరల్ వీడియో: సచిన్ చేసిన ఈ పనికి అందరూ షాక్

సచిన్ టెండూల్కర్ అంటే ప్రపంచానికి పరిచయం అక్కరలేని పేరు.భారత దేశంలో క్రికెట్ అనేది ఒక మతం అయితే ఆ క్రికెట్ కు దేవుడు సచిన్ టెండూల్కర్ గా క్రికెట్ అభిమానులు పిలుచుకుంటారంటే సచిన్ ది ఎంతటి గొప్ప స్థాయి అనేది మనం ఊహించుకోవచ్చు.

 Viral Video:everyone Is Shocked By This Work Done By Sachin Sachin Tendulkar, In-TeluguStop.com

తన ఆటతో దేశానికి, క్రికెట్ కు గౌరవం తెచ్చిన లెజెండ్ సచిన్ టెండూల్కర్.ఇలా చెప్పుకుంటూ పోతే సచిన్ గురించి ఒక పుస్తకమే రాయొచ్చు.అయినా ఇంకా ఎంతో చెప్పాలని అనిపిస్తుంది.సచిన్ గురించి ఎవరిని చెప్పామన్నా ఒక తన అట గురించి మాత్రమే కాకుండా సచిన్ వ్యక్తిత్వం గురించి తప్పక మాట్లాడుతారు.

ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అనేది సచిన్ లోని గొప్ప లక్షణం.గర్వం అనేది మనసులో రాకుండా ప్రతి ఒక్కరిని నవ్వుతూ పలకరిస్తూ, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ లెజెండ్ అనే పదానికి పర్యాయ పదంగా నిలుస్తున్నాడు సచిన్.

అందుకే భారత ప్రభుత్వం దేశ అత్యున్నత అవార్డు అయిన భారత రత్న అవార్డును ఇచ్చి సత్కరించింది.మనం ముందుగా చెప్పుకున్నట్టు సచిన్ బయట చాలా సాధారణంగా ఉంటాడు.

అయితే క్రికెట్ మ్యాచ్ గురించి మరొక చోటకి వెళ్తున్న సమయంలో కరోనా టెస్ట్ తప్పనిసరి అని మనకు తెలిసిందే.అయితే అందులో భాగంగానే కోవిడ్ టెస్ట్ తీసుకునే సమయంలో నర్సు సచిన్ సాంపిల్స్ సేకరిస్తున్న సమయంలో సాంపిల్స్ తీసుకున్నాక ఒక్కసారిగా గట్టిగా అరిచాడు.

ఒక్కసారిగా అక్కడున్న వారు షాక్ కు గురయ్యారు.సచిన్ కి ఏమైందని ఆందోళన చెందారు.

వెంటనే సచిన్ నవ్వడంతో ఆట పట్టించాడని తెలిసి అందరూ ఊపిరి పీల్చుకున్నారు.ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

సచిన్ అభిమానుల కామెంట్స్ తో ఈ వీడియో నెట్టింట్లో మరింత వైరల్ అవుతోంది.మీకూ ఈ వీడియో చూడాలని ఉందా.

ఇంకెందుకు ఆలస్యం.చూసేయండి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube