బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్3 ద్వారా అలీరేజా భారీస్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.బిగ్ బాస్ షో తర్వాత అలీ రేజాకు పలు సినిమాల్లో ఆఫర్లు దక్కాయి.
ఈ ఏడాది విడుదలైన వైల్డ్ డాగ్ సినిమాలో అలీ రేజా కీలక పాత్రలో నటించారు.బుల్లితెర సీరియళ్లలో కూడా నటించి అలీ రేజా ఫ్యాన్ ఫాలోయింగ్ ను అంతకంతకూ పెంచుకుంటూ ఉండటం గమనార్హం.
త్వరలో అలీ రేజా తండ్రి కానుండగా అలీరేజా భార్య మసుమ్ యొక్క సీమంతం వేడుక ఘనంగా జరిగింది.మసుమ్ సీమంతం వేడుకకు బుల్లితెర సీరియళ్లు, బిగ్ బాస్ షో ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న శ్రీవాణి, హిమజ, శివజ్యోతి మరి కొందరు సెలబ్రిటీలు హాజరయ్యారు.
అలీరేజా దంపతుల గురించి నెటిజన్లు క్యూట్ కపుల్ అంటూ కామెంట్లు చేస్తుండటం గమనార్హం.అలీరేజా పలు సినిమాల్లో నటిస్తుండగా నటుడిగా, మోడల్ గా అలీ రేజా రాణిస్తుండటం గమనార్హం.

ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.గాయకుడు సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అలీ రేజా గుండెల్లో దమ్మున్న దోస్త్ ఖాజా భాయ్ అనే సినిమాలో కూడా నటిస్తున్నారు.అలీ రేజా కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటూ ఉండగా భారీ బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తే అలీ రేజాకు మరిన్ని కొత్త సినిమా ఆఫర్లు అయితే వచ్చే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు
.