మన శరీరానికి కావాల్సిన అతి ముఖ్యమైన విటమిన్స్‌లో `విటమిన్ కె` ఒకటి.అందుకే రెగ్యులర్‌గా విటిమన్ కె ఉండే ఆహారాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు.
అయితే చాలా మంది ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తుంటారు.దాంతో శరీరంలో విటమిన్ కె కొరత ఏర్పడుతుంది.
ఫలితంగా అనేక అనారోగ్య సమస్యలు చుట్టేస్తుంటాయి.అయితే మరి విటమిన్ కె లోపాన్ని ఎలా గుర్తించాలి.? అసలు విటమిన్ కె లోపాన్ని సూచించే లక్షణాలు ఏంటీ.? విటమిన్ కె ఏ ఏ ఆహారాల్లో పుష్పలంగా ఉంటుంది అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఎముకలు మరియు కండరాలు బలంగా ఉండాలంటే విటమిన్ కె ఎంతో అవసరం.ఇది లోపించనప్పుడు ఎముకలు, కండరాలు బలహీనంగా మారిపోతాయి.దాంతో చిన్న చిన్న దెబ్బలకే ఎముకలు విరగడం, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు వంటివి వేధిస్తాయి.ఇలా తరచూ జరిగితే ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి.
గాయాలు నయం కావాలంటే శరీరంలో విటమిన్ కె పుష్కలంగా ఉండాలి.అలా లేదు అంటే గాయాలు త్వరగా మానవు.
మరియు గాయాలైనప్పుడు రక్తస్రావం తీవ్రంగా అవుతుంది.అలాగే చిగుళ్ల నుంచి రక్తం కారడం, మూత్రం లేదా మలంలో రక్తం పడడం, చర్మం పాలిపోవడం, బలహీనత, నీరసం, అలసట, గుండె కొట్టుకునే వేగం పెరగడం ఇవన్నీ కూడా విటమిన్ కె లోపించడం వల్ల కనిపించే లక్షణాలే.
ఈ లక్షణాలు ఎవరిలోనైనా ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.అలాగే డైట్‌లో పచ్చిబఠానీలు, బెండకాయలు, ఉల్లికాడలు, కీరదోస, కివి పండ్లు, క్యాబేజ్, బ్రొకోలి, పాల కూర, తోటకూర, గోంగూర, బచ్చలి కూర, వాల్ నట్స్, బాదం పప్పు, బ్రెజిల్ నట్స్, ఎర్ర కంది పప్పు వంటి ఆహారాలను డైట్‌లో చేర్చుకోవాలి.తద్వారా మీ శరీరానికి సమృద్ధిగా విటమిన్ కె అందుతుంది.