చింతపండు.ఈ పేరు వినగానే నోట్లో నీళ్లూరుతుంటాయి.
పుల్ల పుల్లగా ఉండే ఈ చింతపండును వంటల్లో విరి విరిగా ఉపయోగిస్తుంటారు.వంటలకు మంచి రుచిని ఇవ్వడమే కాదు.
చింతపండుతో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.పూర్వకాలం నుంచి వినియోగించే ఈ చింతపండు ఎన్నో అనారోగ్య సమస్యలను సైతం దూరం చేస్తుంది.
ముఖ్యంగా అధిక బరువును తగ్గించడంలోనే చింతపండు అద్భుతంగా సహాయపడుతుంది.నేటి కాలంలో చాలా మంది ఈ అధిక బరువు సమస్యతో బాధ పడుతున్నారు.
ఎంత వద్దనుకున్నా పెరిగే ఈ బరువును నియంత్రించుకునేందుకు ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు.తినడం మానేసి మరీ వ్యాయామాలు చేస్తుంటారు.అయినప్పటికీ బరువు తగ్గకుంటే చింతిస్తుంటారు.అయితే బరువు తగ్గించడంలో చింతపండు గ్రేట్‌గా సహాయపడుతుంది.
బరువు తగ్గాలి అని ప్రయత్నించే వారు చింతపండు రసం తాగడం వల్ల.అందులో ఉండే డైయురెటిక్ గుణాలు శరీరంలో అదనపు కొవ్వును, విషపదార్థాలను బయటకు పంపిస్తాయి.
అలాగే చింతపండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.ఫైబర్ ఉన్న ఏ ఆహారం తీసుకున్నా బరువు తగ్గుతారు.చింతపండు రసం తీసుకోవడం వల్ల ఎక్కువ సమయం ఆకలి వేయకుండా ఉంటుంది.దాంతో వేరే ఆహారానికి దూరంగా ఉంటారు.
ఫలితం బరువు తగ్గొచ్చు.ఇక చింతపండుతో మరిన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.
పొటాషియం పుష్కలంగా ఉండే చింతపండు తీసుకోవడం వల్ల గుండె పని తీరును మెరుగుపరుస్తుంది.అదే సమయంలో అధిక రక్తపోటు కూడా అదుపులో ఉంచుతుంది.
అలాగే చింతపండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.కాబట్టి, చింతపండును రెగ్యులర్ డైట్లో లిమిట్‌గా తీసుకోవడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి బలపడుతుంది.ఇక మధుమేహం ఉన్న వారు చింతపండు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.చింతపండు ప్రతి రోజు ఏదో ఒక రూపంలో తీసుకుంటే.
జీర్ణ సమస్యలు కూడా దూరం అవుతాయి.