దేశ యువత నేడు సోషల్ మీడియా( Social media ) మత్తులో మునిగి తేలుతోంది అని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ క్రమంలోనే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌కు విపరీతంగా క్రేజ్ పెరిగిపోయింది.
చాలా మంది యువత ప్రస్తుతం రీల్స్ చేయడం, చూడడం కోసమే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదు.అయితే అందరినీ ఆకట్టుకునేలా రీల్స్( Reels ) కోసం వీడియోని ఎడిట్ చేయడం అంటే సాధారణమైన విషయం కాదు.
దానికి చాలా నైపుణ్యం అవసరం.
మొదట కెమెరా మీద ఒకింత అవగాహన ఉండాలి.తరువాత యాక్టింగ్, ఎడిటింగ్ ఇలా చాలా విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి.ఇక స్టంట్ వీడియోలు చేయాలనుకున్నప్పుడు ఒక్కోసారి ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి.
కాబట్టి ప్రతిక్షణం అప్రమత్తతతో వ్యవహరిస్తూ చేయాలి.ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో ఓ అజాగ్రత్త కలిగిన యువతీయువకుల వ్యవహారానికి సంబందించినది.
ఈ వీడియోలో యువతీయువకులు రీల్స్ చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.అయితే ఆ సమయంలో ఓ యువకుడు అనుకోని ప్రమాదానికి గురై గాయపడ్డాడు.
ఐ యామ్ హర్యానావి అనే ఇన్‌స్టాగ్రామ్( Instagram ) హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ చేయగా ప్రస్తుతం అది లక్షల్లో వ్యూస్ సొంతం చేసుంతోంది.వైరల్ అవుతున్న ఆ వీడియోలో.ఓ పార్క్ దగ్గర చిత్రీకరించినట్టు తెలుస్తోంది.ఇక్కడ ఒక యువకుడు ఓ అమ్మాయి చేయి పట్టుకుని నడుస్తున్నాడు.మరో చేతిలో గులాబీ పూవుని కూడా పెట్టుకున్నాడు.ఆ యువకుడు యువతి చేయి పట్టుకుని అకస్మాత్తుగా బ్యాక్‌ఫ్లిప్ చేయడానికి యత్నించాడు.
అతడు గాల్లో ఉండగా వెనుక నుంచి మరో అమ్మాయి రావడంతో ఇద్దరూ ఒకరినొకరు ఢీకొని కింద పడిపోయారు.అమ్మాయికి ఏమీ అవలేదు కానీ, అబ్బాయికి మాత్రం మీద విరిగిన పరిస్థితి నెలకొంది.
కాగా ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.మీరు కూడా ఈ వీడియోని తిలకించి మీమీ అభిప్రాయాలను తెలియజేయండి.