మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్పూర్‌లో ఎవరూ కలలో కూడా ఊహించని సంఘటన చోటుచేసుకుంది.విక్కీ కౌశల్ (Vicky Kaushal)హీరోగా వచ్చిన ‘ఛావా’ సినిమా చూసిన జనం ఒక్కసారిగా నిధి వేటకు దిగారు.
వీళ్లు ఛత్రపతి సంభాజీ మహారాజ్ (Chhatrapati Sambhaji Maharaj)కథతో వచ్చిన ఈ సినిమా చూశాక, అసిర్‌గఢ్ కోట దగ్గర మొఘల్ కాలం నాటి బంగారు నాణాలు గుప్త నిధులుగా ఉన్నాయని పుకార్లు షికార్లు కొట్టాయి.దాంతో జనం రాత్రికి రాత్రే తవ్వకాలు మొదలుపెట్టారు.
రాత్రి 7 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు ఊరంతా తలా ఒక టార్చ్ లైట్, మెటల్ డిటెక్టర్(Torch light, metal detector) పట్టుకుని పొలాల్లో వెతికారు.ఎప్పటినుంచో అసిర్‌గఢ్ కోట(Asirgarh Fort) దగ్గర నిధి ఉందనే కథలు ఉండటంతో, సినిమా పుణ్యమా అని ఒక్కసారిగా అందరికీ ఆశలు రేగాయి.
కానీ ఎంత వెతికినా చిల్లి గవ్వ కూడా దొరకలేదు.

ఈ తవ్వకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు.ఇలా ఇష్టం వచ్చినట్లు తవ్వకాలు జరపడం చట్టరీత్యా నేరమని, ప్రమాదకరమని హెచ్చరించారు.పుకార్లు నమ్మొద్దని, ఇబ్బందుల్లో పడే పనులు చేయొద్దని ఊరి వాళ్లకు గట్టిగా చెప్పారు.
సినిమాలు జనాల నమ్మకాలను, పనులను ఎంతగా ప్రభావితం చేస్తాయో ఈ ఘటన చూస్తే అర్థమవుతుంది. ‘ఛావా’(Chhaava ) హిస్టారికల్ యాక్షన్ సినిమానే కానీ, కొందరు దాన్ని నిజం అనుకున్నట్లున్నారు.
సినిమాలు వినోదం కోసం మాత్రమే కానీ, చరిత్రను పూర్తిగా నమ్మకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అసిర్‌గఢ్ కోటకు మొఘల్ చక్రవర్తి అక్బర్(Mughal Emperor Akbar at Asirgarh Fort) కు సంబంధం ఉంది.అక్కడ నిధి దాగి ఉందనే కథలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి.మొఘల్-మరాఠా యుద్ధాల సమయంలో దోచుకున్న సంపదను అక్కడ దాచిపెట్టారని చాలా మంది నమ్ముతారు.‘ఛావా’ సినిమా రావడంతో ఆ పాత కథలు మళ్లీ తెరపైకి వచ్చాయి.

లక్ష్మణ్ ఉటేకర్ (Laxman Utekar)దర్శకత్వం వహించిన ‘ఛావా’ సినిమాలో సంభాజీ మహారాజ్ కథ ఉంది.మొఘల్ సైన్యం మరాఠా సంపదను దోచుకుని అసిర్‌గఢ్ కోటలో దాచిపెట్టినట్లు సినిమాలో చూపించడంతో, అది చూసి జనం నిధి కోసం తవ్వకాలు మొదలుపెట్టారు.







