కూలీ వండిన కిచిడీ తిన్న పీఎం మోడీ.. 11,300 అడుగుల ఎత్తులో?

ప్రధాని మోడీ శనివారం రాత్రి ఉత్తరాఖండ్‌లోని మానాలో ఓ గుడిసెలో బస చేశారు.అక్కడ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) కూలీ తయారు చేసిన కిచిడీ, మాండ్వే కీ రోటీ, లోకల్ చట్నీ, ఝాగోరే కీ ఖీర్ తిన్నారు.

 Pm Modi Ate Kichidi Cooked By Kooli , Pm Narendra Modi, Uttarakhand, Basa, Kichi-TeluguStop.com

ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 11,300 అడుగుల ఎత్తులో ఉంటుంది.బీఆర్ఓ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.

మానాలోని డిటాచ్‌మెంట్ సెంటర్‌కు ప్రధాని మోడీ వచ్చారు.రాత్రి ఇక్కడే బస చేయబోతున్నట్లు తెలిసి చాలా ఆశ్చర్యపోయాం.

ఈ సెంటర్ ఓ యువ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో నడుస్తోంది.

ఇందులో ప్రత్యేక సౌకర్యాలు ఏవీ లేవు.అలాంటి సెంటర్‌కు ప్రధాని మోడీ వస్తున్నట్లు తెలిసింది.72 గంటల కన్నా తక్కువ సమయంలో ఓ తాత్కాలిక గుడిసెను నౌకలా మార్చాం.ఈ డిటాచ్‌మెంట్‌లో ప్రధాని మోడీ రోడ్డు నిర్మాణ కూలీలతో మాట్లాడారు.రాత్రి భోజనం కోసం కిచిడీ తయారు చేయాలని ఓ కూలీని అడిగారు.ప్రధాని మోడీ కోసం ప్రత్యేక వంటకాలను తయారు చేయలేదు.ఇక్కడ దొరికే సరుకులతోనే వంటకాలు తయారు చేశాం.

’ అని పేర్కొన్నారు.

అధికారులు ప్రధాని మోడీ కోసం బద్రీనాథ్‌లో బస ఏర్పాటు చేశారు.

కానీ డిటాచ్‌మెంట్‌లోనే తాను రాత్రి బస చేస్తున్నట్లు ప్రధాని మోడీ చెప్పారు.ప్రధాని మోడీతో పాటు తన వ్యక్తిగత సిబ్బంది కూడా బస చేస్తున్నట్లు పేర్కొన్నారు.

అలాగే వీరంతా డిటాచ్‌మెంట్ రోడ్డు నిర్మాణ కూలీ తయారు చేసిన ఆహారాన్ని తింటారని వెల్లడించారు.దీంతో ఓ కుక్‌ను రంగంలోకి దింపారు.

కిచిడీ, పోహా, మీఠా కరేలీ, ఝాగోరే కీ ఖీల్ తయారు చేశారు.

Telugu Badrinath, Basa, Kedarnath, Kichidi, Soldiers, Uttarakhand-Political

ప్రధాని మోడీ సముద్ర మట్టం నుంచి 11,300 అడుగుల ఎత్తులో బస చేశారు.సున్నా కన్నా తక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే వాతావరణంలో రాత్రి బస చేశారు.ఈ మేరకు వంట చేసి తనకు సేవలందించిన కూలీలకు ప్రధాని మోడీ ప్రశంసించారు.

బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సిబ్బంది అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ ఎంతో శ్రమిస్తున్నారని ప్రధాని మోడీ కూలీలను ప్రశంసించారు.కాగా, కేదార్‌నాథ్, బద్రీనాథ్ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు జరిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube