నువ్వు ఎంత టాలెంట్ చూపించిన ఇంతేలే అంటూ అషు రెడ్డి షాకింగ్ కామెంట్స్ వైరల్!

సోషల్ మీడియా ద్వారా స్టార్ గా మారి ఇండస్ట్రీలో బాగా దూసుకుపోతున్న స్టార్ అషూ రెడ్డి.ఇక ఈ ముద్దుగుమ్మ గురించి సోషల్ మీడియా ప్రియులకు, బుల్లితెర ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

 Ashu Reddys Shocking Comments Saying How Much Talent You Have Shown Are Viral As-TeluguStop.com

బుల్లితెర ఆర్టిస్ట్ గా తన పరిచయాన్ని పూర్తిగా పెంచుకుంది అషు.పైగా మంచి అభిమానాన్ని సొంతం చేసుకుంది.గతంలో రెండుసార్లు బిగ్ బాస్ హౌస్ లో పాల్గొని బాగా రచ్చ చేసింది.కానీ టైటిల్ విన్నర్ గా మాత్రం గెలవలేకపోయింది.ఇక తన హాట్ అందాలతో మాత్రం కుర్రాళ్ళను తన వైపు మలుపుకుంది.ఇక ఈ బ్యూటీ ఇంట్లో కంటే ఎక్కువగా నెట్టింట్లో గడుపుతుంది.

ఇక అషూ డబ్స్మాష్ వీడియోలతో తొలిసారిగా ఆకట్టుకుంది.ఈ ముద్దుగుమ్మ చూడటానికి సమంతలా కనిపించటంతో ఆ గుర్తింపుతోనే ఇప్పుడు ఇక్కడికి చేరుకుంది.

ఇక సమంత లుక్ ను పోలి ఉండటంతో అందరి దృష్టిలో పడటంతో జూనియర్ సమంత లా పేరు సంపాదించుకుంది.అలా ఎటువంటి అడ్డంకులు లేకుండానే వెండితెరపై కూడా అవకాశం అందుకుంది.

కానీ ఒక సినిమాతోనే అవకాశం అందుకొని ఆ తర్వాత వెండితెరకు గుడ్ బై చెప్పేసింది.నిజానికి తనకు వెండితెరపై ఎటువంటి అవకాశాలు రావట్లేదు అని చెప్పవచ్చు.ఇక బిగ్ బాస్ షో తర్వాత అషు రెడ్డి కెరీర్ పీక్స్ లోకి వెళ్ళింది.విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

పవర్ స్టార్ అభిమాని కావడంతో పవన్ అభిమానుల నుండి మరింత సపోర్టు సంపాదించుకుంది.

గతంలో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో చేసిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.వీరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని అప్పట్లో తెగ పుకార్లు కూడా వచ్చాయి.ఆ తర్వాత బుల్లితెరలో ప్రసారమైన కామెడీ స్టార్ అనే కామెడీ షోలో లేడీ కమెడియన్ గా అడుగు పెట్టి తన కామెడీతో ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.

కానీ అక్కడ కూడా ఎక్కువ కాలం లేకపోయింది.అక్కడ కూడా మరో కమెడియన్ ఎక్స్ప్రెస్ హరితో బాగా రెచ్చిపోయింది.ఏకంగా ముద్దులు పెట్టి, హగ్ లు ఇచ్చి అందరి దృష్టిలో పడింది.ఆ తర్వాత యాంకర్ రవి తో కలిసి ఓ షోలో యాంకర్ గా కూడా చేసి బాగా రెచ్చిపోయింది.

అంతలోనే ఓటీటీలో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ లో అవకాశం అందుకుంది.ఇక ఇందులో కూడా అషు మరింత క్రేజ్ సంపాదించుకుంది.

ఇక ఇందులో మరో కంటెస్టెంట్ అజయ్ తో బాగా రచ్చ చేసింది.

రెండుసార్లు బిగ్ బాస్ లో అడుగు పెట్టినప్పటికీ కూడా వెండితెరపై ఎటువంటి అవకాశం అందుకోవటం లేదు ఈ బ్యూటీ.ఇక బిగ్ బాస్ తర్వాత మళ్లీ నెట్టింట్లో తన రచ్చ మొదలు పెట్టింది.ప్రతి రోజు ఫోటోలు షేర్ చేసుకుంటూ తెగ లైకులు సంపాదించుకుంటుంది.

అప్పుడప్పుడు ఈమె చేసే పోస్టులను చూసి నెటిజన్లు దారుణమైన ట్రోల్స్, కామెంట్లు పెడుతూ ఉంటారు.ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇన్ స్టాలో ఒక పోస్ట్ షేర్ చేసుకుంది.

అందులో హాట్ గా కనిపించడంతో ఆమె ఓవర్ షో చూసి నెటిజన్స్ దారుణంగా కామెంట్లు పెడుతున్నారు.ఇక ఓ నెటిజన్ నువ్వు ఎంత టాలెంట్ చూపించిన ఇంతేలే అంటూ కామెంట్ చేయగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube