జొమాటో, స్విగ్గి ( Zomato, Swiggy )వంటివి అందుబాటులోకి వచ్చిన తరువాత జనాలు చాలావరకు హోటల్స్ కి వెళ్ళడం మానేశారు.ఎందుకంటే, నేటి దైనందిత జీవితంలో సమయం అనేది అందరికీ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది.
అయితే ఈ క్రమంలో ఫుడ్ ఆర్డర్ చేసుకునే వారే కాదు, వాటి ద్వారా సంపాదించుకునే వారు కూడా ఎక్కువైపోయారు.దీంతో కొంతమంది ఔత్సాహిక కుర్రాళ్ళు తమ లగ్జరీ బైకులను డెలివరీ చేయడానికి వాడుతుండడం విశేషం.
ఇలాంటి సంఘటనలు ఇప్పటికే చాలా వెలుగులోకి రాగాతాజాగా మరో సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇన్‌స్టాగ్రామ్ యూజర్ రాజ్ గోథాంకర్( Raj Gothankar ) పోస్ట్ చేసిన ఈ వీడియోని చూసి నెటిజనం అయితే అవాక్కవుతున్నారు.ఇక్కడ వీడియో మీరు చూసినట్లయితే ఇందులో ఖరీదైన డుకాటి కంపెనీ బైక్ ఒకటి కనిపిస్తుంది.దీని ధర సుమారు రూ.10 లక్షల వరకు ఉండే అవకాశం వుంది.దీనిపైన కూర్చున్న డెలివరీ బాయ్ జొమాటో షర్ట్ ధరించి వుండడం మనం గమనించవచ్చు.అతడు తన ప్రతి ఆర్డర్‌కు 200 వరకు సంపాదిస్తున్నట్లు, అందులో రూ.50 పెట్రోలు కోసం వెచ్చించినా.తనకి రూ.150 మిగులుతుందని.ఇలా రోజుకి 20 ఆర్డర్స్ డెలివరీ చేస్తానని చెప్పాడు.

అతగాడు చెప్పినదాని ప్రకారం, అతడు నెలకు రూ.45,000 సంపాదిస్తాడని మనకి అర్ధం అవుతోంది.నిజానికి అతడు ప్రతి ఆర్డర్‌కు రూ.30 నుంచి రూ.40 మాత్రమే వస్తుందని తెలుస్తోంది.కాగా ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.అతడు చెప్పినదాని ప్రకారం రోజుకి రూ.3000, ఇలా నెలకు రూ.90,000 సంపాదించాలి అంటూ కొందరు కామెంట్స్ చేస్తే, కొంతమంది కామెడీ కోసం చేసిన వీడియో మాదిరిగా ఉందని అంటున్నారు.మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది.







