ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగం పెరిగిపోతున్న సంగతి తెలిసిందే.కరోనా కారణంగా చాల దేశాలలో ఆర్ధిక కష్టాలు పెరిగిపోయాయి.
చాల కంపెనీలు క్లోజ్ అయిపోతున్నాయి.దీంతో ఐటి ఇంకా పలు రంగాలలో వేలకు వేలు ఉద్యోగాలు కోల్పోతున్నారు.
ఇలాంటి తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత కొద్ది నెలల నుండి అనేక నోటిఫికేషన్ లు విడుదల చేస్తూ ఉంది.
ఇదిలా ఉంటే తాజాగా ఉపాధ్యాయుల రిక్రూట్ మెంట్ పై మంత్రి హరీష్ రావు కీలక ప్రకటన చేయడం జరిగింది.
టీచర్స్ రిక్రూట్ మెంట్ పై సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని… త్వరలో నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో PRTU రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది.
తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని… ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించామని పేర్కొన్నారు.త్వరలో ఎంప్లాయిస్ కార్డు విషయంలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.







