టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్( NTR ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాతో( RRR ) పాన్ ఇండియా స్టార్ గా మారిన విషయం తెలిసిందే.
గత ఏడాది విడుదలైన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకోవడంతోపాటు ఆస్కార్ అవార్డును సైతం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా మారిన తర్వాత వస్తున్న మొట్టమొదటి సినిమా ఇదే కావడం విశేషం.అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా, విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు.
దీంతో ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలను నెలకొన్నాయి.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఇది ఇలా ఉండు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా తీయాలని ఉంది అంటూ ఒక హాలీవుడ్ డైరెక్టర్ కాన్స్ చేశాడు.తాజాగా హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ గన్( James Gunn ) ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ అద్భుతంగా నటించారు.

ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ఉంది అంటూ తన మనసులోని మాటను బయటపెట్టారు జేమ్స్ గన్. అంతేకాకుండా ఎన్టీఆర్ కోసం తగిన పాత్రను సిద్ధం చేస్తానని ఆయన తెలిపారు.ఆర్ఆర్ఆర్ సినిమాలో వ్యాన్ లో నుంచి పులులు, వన్య మృగాలతో ఎన్టీఆర్ దూకే సన్నివేశం తనకు ఎంతో బాగా నచ్చిందని అందులో ఎన్టీఆర్ చాలా కూల్ యాక్టింగ్ చేశారు అంటూ ప్రశంశలు కురిపించారు.







