వైరల్: భారీ వర్షం కారణంగా వెలికివచ్చిన అరుదైన పాము.. చూడండి ఎలా పాకుతుందో?

భారీ వర్షాల కారణంగా అనేక చోట్ల అనేకరకాల సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.సోషల్ మీడియా అందుబాటులోకి వుంది కాబట్టి ఆయా దృశ్యాలు వైరల్ కావడంతో మన కంటికి కనబడుతున్నాయి.

 Rare White Snake Spotted In Himachal Pradesh Details, Strange Snake, Viral News,-TeluguStop.com

వరదల కారణంగా రకరకాల జంతువులు, పాములు, చేపలు ఏకంగా ఇళ్లలోకి కొట్టుకు వస్తున్న పరిస్థితి.వరద సమయాల్లో ఇలాంటి ఘటనలు జరగడం చాలా సాధారణం.

తాజాగా మధ్య హిమాచల్ ప్రదేశ్‌లో( Himachal Pradesh ) అరుదైన తెల్లటి రంగు ‘అల్బినో పాము’( Albino Snake ) కనిపించి స్థానికులకు కనువిందు చేసింది.దాంతో వారు తమ కెమెరాలలో దాన్ని బందించి ఆ తెల్లటి శ్వేతనాగు వీడియో ఆన్‌లైన్‌లో షేర్ చేసారు.

దాంతో అది కాస్త వైరల్ అవుతోంది.

కాగా ఆ పాము 6 అడుగుల పొడవు కలిగి ఉన్నట్టు కనబడుతోంది.కాగా అరుదైన, వింతైన ఆ పామును చూసేందుకు జనాలు ఎగబడ్డారు.భయపడుతూనే శ్వేతనాగుతో( White Snake ) సెల్ఫీలు దిగేందుకు ఉత్సుకతను చూపించారు.

గతేడాది పూణెలో అల్బినో పాము కనిపించిన సంగతి మనం విన్నాం.అల్బినోలు వాటి విలక్షణమైన రూపానికి ప్రసిద్ధి చెందాయి.

వాటి అసాధారణ రంగు కారణంగా అవి అరుదైన జాతులుగా గుర్తించబడ్డాయి.శ్వేతనాగులు అనేవి చాలా అరుదుగా కనిపిస్తాయి.

శ్వేత నాగు ఎంత ప్రాచుర్యం పొందింది అంటే టాలీవుడ్లో దీనిపైన ఏకంగా ఒక సినిమా వచ్చింది.ఈ సినిమాలో స్వర్గీయ నటి సౌందర్య( Soundarya ) మెయిన్ రోల్ చేయగా ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.

ఇంగ్లీష్ లో దీనిని అల్బినో కోబ్రా( Albino Cobra ) అంటారు.దీనిని ప్రత్యక్షంగా చాలా తక్కువ మంది చూసి వుంటారు.ఇదో అరుదైన రకం పాము.మామూలు పాములకన్నా భిన్నంగా ఉండడం దీని ప్రత్యేకత.దాని చర్మం తెల్లగా మిలమిల మెరిసిపోతూ ఉంటుంది.ఇది అల్బినిజం అని పిలువబడే జన్యుపరమైన అసాధారణతతో జన్మిస్తుంది.

అందుకే దానికి ఆపేరు వచ్చింది.దీని శరీరం, కళ్ళలో కలర్‌ ఉండదు.

ఇది పూర్తిగా తెల్లటి రంగులో ఉండే పాము.ఇటీవల తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో పర్వతగిరి గ్రామ శివారులో ప్రధాన రహదారిపై శ్వేతనాగు ప్రత్యక్షమైంది.

ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గానీ, సడెన్ గా నడిరోడ్డుపై ప్రత్యక్షం అయ్యింది.పామును చూసేందుకు జనాలు భారీగా గుమిగూడటంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube