ఈ ప్రశ్నకు ఎవరైనా సరే కలవవు అనే చెబుతారు.కాని కలిశాయి అని చెబుతున్నారు బీహార్లోని అధికార జనతా దళ్ (యూ) నాయకులు.
వారు చెబుతున్న ఉత్తర, దక్షిణ ధ్రువాలు ఏవి? భారతీయ జనతా పార్టీ, ఆలిండియా మజ్లీస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏ ఐ ఎం ఐ ఏం).అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న బీహార్లో ఈ రెండు పార్టీలు కలిసి పనిచేస్తూ అధికార పార్టీ అవకాశాలను దెబ్బ తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయని జెదీయూ ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి ఆరోపించారు.బీహార్లో జెదీయూ, ఆర్జేడీ, కాంగెస్ కలిసి మహా కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే.భాజపా, ఏం ఐ ఏం కలిసి కూటమిని దెబ్బ తీయాలని చెప్పడం నమ్మదగ్గ విషయమేనా? ఈ రెండు పార్టీలు ఉప్పు , నిప్పు మాదిరిగా ఉంటాయనే విషయం అందరికీ తెలుసు.ఏం ఐ ఏం బలంగా ఉన్న హైదారాబాదులో ఈ రెండు పార్టీల రాజకీయ ఘర్షణలు చిరపరిచితం.చిరకాల శత్రువులైన ఈ పార్టీలు ఏ కోణంలోనూ కలిసి పనిచేసే అవకాశం లేదు.
మహా కూటమి గెలుపు అవకాశాలను దెబ్బ తీయాల్సిందిగా ముస్లీముల పార్టీకి భాజపా లక్ష్యంగా నిర్ణయించిందట.రాష్ట్రంలో సీఎం నితీష్ కుమార్ చేసిన అభివృద్ధి చూసి జనం చాలా సంతోషంగా ఉన్నారని త్యాగి అన్నారు.
అలాంటప్పుడు భయపడాల్సిన అవసరం ఏముంది? ఒవైసీ పార్టీ జనాలకు చేసిన ప్రయోజనం ఏమీ లేదని త్యాగీ అన్నారు.ఒవైసీ ముస్లీముల శ్రేయోభిలాషి కాదని, భాజపాకు ప్రయోజనం కలిగించడానికి బీహార్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నదని త్యాగీ ఆరోపించారు.
మొత్తం మీద ఎం ఐ ఏం రచ్చ గెలవాలని చేస్తున్న ప్రయత్నాలు అధికార పార్టీకి భయం కలిగిస్తున్నది.







