మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్ నగరంలో ఏఐజి ( ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ) డాక్టర్స్ ని అభినందించారు.ఊహించనివిధంగా హాస్పిటల్ కి వెళ్లి వైద్యులకు సడన్ సర్ ప్రైజ్ చేస్తూ సిబ్బందితో ముచ్చటించారు.
ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
లాక్ డౌన్ సమయం లో కరోనా విజృంభన సమయంలో ఏఐజి వైద్యులు బాగా కష్టపడ్డారని చాలా మంది ప్రాణాలను కాపాడటం జరిగిందని అభినందించారు.
ఈ సందర్భంగా పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ రెడ్డి నాగేశ్వర రెడ్డి నీ కలిసినట్లు కూడా చిరంజీవి తెలిపారు.ఇదిలా ఉంటే గతంలో ఏఐజి హాస్పిటల్స్ పరుగు, నడక కార్యక్రమాలు నిర్వహించగా అప్పట్లో చిరంజీవి మద్దతు తెలుపుతూ ఓ వీడియోను రిలీజ్ చేయగా ఇప్పుడు నేరుగా వెళ్లి ఆ హాస్పిటల్స్ వైద్య బృందాన్ని కలిసి ప్రశంసించడం తో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.