లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితం అయిన జనాలు సోషల్ మీడియాలో ఎక్కువగా కాలక్షేపం చేస్తున్నారు.ఈ నేపధ్యంలో టైం పాస్ కోసం పాత వీడియోలు అన్ని మళ్ళీ వెనక్కి తిప్పి చూస్తున్నారు.
నచ్చిన వీడియోని సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తున్నారు.అలా చాలా వీడియోలు ఈ లాక్ డౌన్ సమయంలో వైరల్ అవుతున్నాయి.
కొన్ని పాత సినిమాల పాటలు కూడా టిక్ టాక్ లాంటి యాప్ ల కారణంగా పాపులర్ అవుతున్నాయి.ఇప్పుడు అలాంటి ఒక వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ ప్రముఖ హాలీవుడ్ టీవీ హోస్ట్ ఓప్రా విన్‌ఫ్రే షోకి ఎప్పుడో 15 ఏళ్ల క్రితం హాజరైంది.ఈ షోలో ఐశ్వర్య ఒఫ్రాకి చీర కట్టుకోవటం ఎలాగో నేర్పుతున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది.
ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళగా ఐశ్వర్య ఈ షోకు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఓ పింక్ కలర్ శారీని ఐశ్వర్య ఓప్రాకు బహుమతిగా ఇచ్చారు.అంతేకాకుండా దాన్ని ఆమెకు కట్టారు.చీరలో తాను అందంగా కనిపిస్తున్నానని ఓప్రా సంతోషం వ్యక్తం చేశారు.
ఈ షోలో ఐశ్వర్య మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, ఆతిథ్యం గురించి చెప్పారు.సనాతన ధర్మం, భారతీయ స్త్రీల కట్టుబాట్లు, ఆచారాల గురించి ఐశ్వర్య చెప్పడం విశేషం.
ఇక అ షో తర్వాత ఒఫ్రా ఇండియా వచ్చిన ప్రతిసారి సంప్రదాయ చీరకట్టులోనే ఎక్కువగా సందడి చేయడం విశేషం.